Monday, May 6, 2024
- Advertisement -

హైటేక్ స్మగ్లింగ్

- Advertisement -
Ketamine Narcotic Drug 5.924 kgs caught at shamshabad airport…Germany catches woman smuggling cocaine in breast..

స్మ‌గ్లింగ్ ఇప్పుడ పోలీసుల‌కు ఒక స‌వాల్‌గామారింది.  అత్యాధునికి స్కానింగ్ యంత్రాలు వ‌చ్చినా స్మ‌గ్లింగ్‌ను అరిక‌ట్ట‌లేకుపోతున్నారు. ఎంత అత్యాధునికి యంత్రాలు వ‌చ్చినా మాపియాకూడా అంతే  హైటెక్ ప‌ద్ధ‌తుల‌ను ఉప‌యేగిస్తున్నారు. వీరు  స్మ‌గ్లింగ్ చేసే ప‌ద్ద‌త‌లును చూసి అధికార‌లు అవాక్క‌వుతున్నారు.

ఎంత‌వ‌ర‌కు దారితీసిందంటే  దేవుడికి ఉప‌యేగించే కుంకు,ప‌సుపు డ‌బ్బాల‌నుకూడా వ‌ద‌ల‌డంలేదు మాఫియా. ఇట్లాంటి సంఘ‌ట‌న‌లే చోటుచేసుకున్నాయి .మ‌త్తుమందుల‌ను ర‌వాణా చేస్తున్న వ్య‌క్తిని    ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు ప‌ట్టుకున్నారు.  మ‌త్తుప‌దార్థాల‌ను  ర‌వాణా చేస్తున్న విధానాన్ని చూసి బిత్త‌ర‌పోయారు అధికార‌లు.

అక్ర‌మంగా విదేశాల‌కు త‌ర‌లిస్తున్న  రూ.2.32 కోట్ల విలువైన నిశిధ్ధ  మ‌త్తు ప‌దార్థాల‌ను శంషాబాద్ విమానాశ్ర‌య  ఎయిర్ ఇంట‌లిజెన్స్ అధికారులు ప‌ట్టుకున్నారు.  న‌గ‌రానికి చెందిన   ఒక ప్ర‌యానికుడు  ఎంఎచ్ 0199 విమానంలో మ‌లేషియా వెల్ల‌డానికి  శంషాబాద్ విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. అత‌నిపై  అధికారులకు అనుమానంరాకుండా ఎలాంటి విధానాన్ని ఎంచుకున్నాడో చూసిన అధికార‌లు   దిమ్మ‌తిరిగే  షాక్ తిన్నారు.  చిన్న చిన్న డ‌బ్బాల‌లో  5.927 కిలోల కెటామైన్ మ‌త్తుప‌దార్థాన్ని  నింపి దానిపై ప‌సుపు,కుంకుమ పూసి త‌న ల‌గేజీలో పెట్టుకున్నారు. స‌మాచారం అందుకున్న అధికార‌లు త‌నిఖీలు చేయ‌గా మాద‌క ద్ర‌వ్యాల త‌ర‌లింపును గుట్టుర‌ట్టుచేశారు.

ఇలానే డ్ర‌గ్స్‌ను  స్మ‌గ్లింగ్ చేయ‌డానికి  ఓ మ‌గువ చేసిన సాహ‌సాన్ని చూసి జ‌ర్మ‌నీ క‌స్ట‌మ్స్ అధికారుల‌ను నివ్వెర పోయేలా చేసింది. ఆమె ఒక కేజీ బ‌రువుండే కొకైన్ ను త‌న వ‌క్షోజాల లోప‌ల పెట్టి స్ట్రిట్జింగ్ లాంటివి చేయించేసి తెలివిగా దేశం దాటించేయాల‌నుకుంది. కానీ క‌స్ట‌మ్స్ అధికార‌లకు అడ్డంగా దొరికిపోయింది.  జ‌ర్మ‌నీ క‌స్ట‌మ్స్ అధికారులు ఆమె గుట్టును ర‌ట్టు చేశారు

కొలంబియాకు చెందిన ఓ యువ‌తి జ‌ర్మ‌నీ ఎయిర్ పోర్ట్ లో దిగింది. రెగ్యుల‌ర్ చెకింగ్ కోసం క‌స్ట‌మ్స్ అధికారులు ఆ యువ‌తిని మ‌హిళా సిబ్బంది ద‌గ్గ‌రికి పంపారు. వారు చెక్ చేస్తుండ‌గా ఆమె వ‌క్షోజాల‌పై కుట్లు ఉండ‌టం గ‌మ‌నించారు. బ్రాను విప్పి వ‌క్షోజాల మీద చేతుల పెట్టి నొక్క‌గా ఆమె నొప్పితో కేక‌లు పెట్టింది. అనుమానం వ‌చ్చిన అధికారులు  హాస్ప‌ట‌ల్‌కు పంపి శ‌స్త్ర  చికిత్స చేయ‌గా ఒక్కోక్క వ‌క్షోజంనుంచి 500 గ్రాముల కొకైన్‌ను ప్లాస్టిగ్‌గా మార్చి  త‌న వ‌క్షోజాల్లో పెట్టి కుట్టేసుకుంది. వీటి విలువ దాదాపు కోటి 47 ల‌క్ష‌లు ఉంద‌ట‌. ఈ త‌ర‌హా స్మ‌గ్లింగ్ జ‌ర‌గ‌డం జ‌ర్మ‌నీలో ఫ‌స్ట్ టైమ్ అని పోలీసులు చెబుతున్నారు. తాను కొలంబియాలో ముగ్గురు పిల్ల‌ల‌కు త‌ల్లిన‌ని ఓ సాధార‌ణ రైతు కూలీన‌ని ఆమె క‌స్ట‌మ్స్ అధికారుల‌తో విన్న‌వించుకుంది. కానీ అధికార‌లు ఊరుకుంటారా ఆమెపై డ్ర‌గ్స్ ట్రాఫికింగ్ కేసులు పెట్టి  జైలుకు పంపించారు. ఏదైనా  దొరికితే దొంగా దొరక్కుంటే దొర అనె స‌మెత సూటిగా స‌రిపోతుంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -