Thursday, May 9, 2024
- Advertisement -

జగన్ చెబితే విన్నావా బాబూ….కరకట్టనుంచి కృష్ణమ్మే నిన్ను ఖాలీ చేయించిందిగా

- Advertisement -

కృష్ణమ్మ పరవళ్లు తొక్కడంతో.. ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద ఉధృతి పెరిగింది. ఎగువ నుంచి భారీ స్థాయిలో వరద నీరు కిందికి వస్తోంది. పులిచింతల నుంచి భారీగా వరద పోటెత్త నుంటడంతో కృష్ణలో నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో కరకట్ట ప్రమాదంలో పడింది. ఇప్పటికే కరకట్ట మీద అనేక అక్రమ నిర్మాణాలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కూడా ఉంది. వరద తాకిడికి ఇది మునిగిపోయె ప్రమాదం ఏర్పడింది.

స్తుతానికి గెస్ట్ హౌస్ మెట్లదాకా వరద నీరు వచ్చేసింది. చివరకు చంద్రబాబు కుటుంబం వాడుతున్న వాహనాలను కూడా వేరే రిసార్ట్స్ కు తరలించారు. నది పొంగితే మొత్తం నిర్మాణాలన్నీ ముణిగిపోతాయి కాబట్టి కరకట్టను బలోపేతం చేయాలంటే నిర్మాణాలన్నింటినీ తొలగించాలని జగన్మోహన్ రెడ్డి నెత్తి నోరు మొత్తుకున్నారు. అయితే బాబు మాత్రం జగన్ మాటలను పెడచెవిని బెట్టి జగన్ రాజకీయం చేస్తున్నారని తాను నివాసముంటున్న గెస్ట్ హౌస్ ను కూల్చేయాలన్న ప్లాన్ వేశారంటూ చంద్రబాబు నానా రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే..

నదీ పరివాహాక ప్రాంతాల్లో అక్రమ కట్టడాల గురించి జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి చాలామంది ఇష్టానుసారం మాట్లాడారు. అడ్డగోలుగా మాట్లాడారు. చంద్రబాబును సమర్థించడానికి పడరాని పాట్లు పడ్డారు. బాబుకు మాటలతో చెప్తే లాభం లేదనుకొని ఏకంగా కృష్ణానది రంగంలోకి దిగింది. తన పరివాహక ప్రాంతం ఎంతవరకూ ఉందో తేల్చి చెప్పింది. మర్యాదగా తనకు దారి ఇస్తే మంచిదని ఆక్రమణదారులకు తేల్చి చెప్పింది.

వరద నీరు భారీగా వస్తుండటంతో పరిస్థితిని గమనించిన బాబు తట్టా, బుట్టా సర్దుకొని హైదరాబాద్ కు చెక్కేశారని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఎద్దేవ చేశారు. పరిస్ధితిని గమనించిన చంద్రబాబు సిబ్బంది ముందుజాగ్రత్తగా చంద్రబాబు నివాసానికి చుట్టూ భారీ ఎత్తున ఇసుక బస్తాలు పేరుస్తున్నారు. ఇంటి ఆవరణలో కూడా లారీలతో ఇసుకను పోయిస్తున్నారు. క్రింది భాగంలో ఉండే ఫర్నీచర్ మొత్తాన్ని మొదటి అంతస్తులోకి చేర్చారు. వర్షాలు తగ్గి, వరద ముంపు ప్రమాదం తగ్గిన తర్వాతే కరకట్టకు తిరిగి వస్తారని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -