జగన్ , చంద్రబాబు ని తలదన్నేసిన కేటీఆర్

- Advertisement -

ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమీ బాలేదు. ఎంతగా ప్రజల పక్షాన పోరాడదాం అని చూసినా ఆయనకీ కాలం కలిసిరావడం లేదు. తెలిసి చేసిన తప్పులూ తెలియక చేసిన తప్పులూ ఇప్పుడు ఆయన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ఒక పక్క ఏపీ లో మీడియా మొత్తం చంద్రబాబు చేతిలో ఉండిపోవడం జగన్ పత్రిక , ఛానల్ సాక్షి ని అధికార పక్షం బలవంతంగా మూత పెట్టేయడం లాంటివి జరగడం తో జగన్ ఒంటరివారు అయ్యారు.

మీడియా యొక్క ప్రోద్బలం ఎంతగా ఉంటుందో అనే ఉదాహరణ చూపిస్తూ తెలుగు రాష్ట్రాల్లో యువత జగన్ వైపు నుంచే ఎలా మొగ్గు తగ్గారో ఈ సర్వే చెబుతోంది. ఒకప్పుడు గూగుల్ సెర్చ్ లో  వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఎక్కువగా ఉండేది. అయితే.. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నట్లుగా తాజా అధ్యయనాలు స్పష్టం  చేస్తున్నాయి.

- Advertisement -

తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు.. మంత్రి కేటీఆర్ జోరు పెరుగుతోందని.. ఆన్ లైన్ లో ఆయనకు సంబంధించిన విషయాలు తెలుసుకోవటానికి ఆసక్తి వ్యక్తమవుతోందని తేలింది. కేటీఆర్ ఒక పక్క దూసుకునిపోతుంటే జగన్ భారీగా వెనకడిపోతున్నారు. చాలా తక్కువ వ్యవధి లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం చేస్తున్న చంద్రబాబు కి ఆదరణ పెరుగుతూ ఉన్నట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికల సమయం కంటే జగన్ వనకపడగా ఇప్పుడు కేటీఆర్ చంద్రబాబు నీ జగన్ ని మించి పోయారు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -