Friday, April 19, 2024
- Advertisement -

తెలంగాణలో లాక్ డౌన్ పై ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు?

- Advertisement -

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో కరోనా ఆంక్షలను మరింతగా సడలించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. మంగళవారం జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ కంటిన్యూ చేస్తారా? లేక మరికొన్ని ఆంక్షలు సడలిస్తారా? లేక నైట్ కర్ఫ్యూ విధిస్తారా? అన్నది కేబినెట్ మీటింగ్ లో తేలనుంది. లాక్ డౌన్ వల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, లాక్ డౌన్ పెట్టడం వల్ల ఎంతమేర రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లింది అనే విషయాలపై సమగ్ర నివేదికలు కోరారు సీఎం కేసీఆర్. రిజిస్ట్రేషన్లు, ఆబ్కారీ, రవాణా శాఖల నుంచి సమాచారం సేకరించి.. ఆర్థికంగా భారం లేకుండా ఉండే దిశగా కర్ఫ్యూలో సడలింపులు విధించబోతున్నారు.

ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు సడలింపులు ఉన్నాయి. ఇకపై సాయంత్రం 5 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు, ఆపై 6 గంటల వరకు ఆఫీసుల నుంచి, పనిమీద బయటకొచ్చి ఇంటికి తిరిగెళ్లేవారికి వెసులుబాటు ఇవ్వాలనుకుంటున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఆంక్షలు ఈ నెల 9తో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంక్షలను మరింతగా సడలించడంతోపాటు రాత్రిపూట మాత్రం కర్ప్యూను పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 97వేల 751 మందికి టెస్టులు చేయగా.. 1,436 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వీరిలో కొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మరికొందరు హోం ఐసోలేషన్‌లో ఉంటూ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో 14మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో ప్రస్తుతం 27,016 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

పాకిస్థాన్‌లో రెండు రైళ్లు ఢీ.. 30 మంది మృతి

బీజేపీలో చేరికపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి క్లారిటీ!

టాలీవుడ్ కి కోలీవుడ్ స్టార్ హీరోల క్యూ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -