Thursday, May 2, 2024
- Advertisement -

పాకిస్థాన్‌లో రెండు రైళ్లు ఢీ.. 30 మంది మృతి

- Advertisement -

ఈ మద్య ప్రపంచంలో రైళ్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా పాకిస్థాన్ లో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 30 మంది చనిపోయారు… చాలా మంది తీవ్ర గాయాలపాలయ్యారు. రెతి – దహార్కి రైల్వే స్టేషన్ల మధ్య మిల్లట్‌ ఎక్స్‌ప్రెస్‌, సర్‌ సయ్యద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. కాగా, పట్టాలు తప్పిన సర్‌ సయ్యద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును మిల్లట్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిందని రైల్వే అధికారులు వెల్లడించారు.

రెండు రైళ్ల బోగీల్లో చాలా మంది ప్రయాణికులు చిక్కుకున్నారని ఆయన చెప్పారు. ఘటనాస్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారని, ఈ ప్రమాదంతో ఆ మార్గంలో నడిచే రైళ్లను నిలిపివేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో 30 మంది చనిపోయారని సింధ్ ప్రావిన్స్‌లోని ఘోట్కి జిల్లా పోలీసు అధికారి ఉస్మాన్ అబ్దుల్లా తెలిపారు.

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఈ ప్రమాదంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

బీజేపీలో చేరికపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి క్లారిటీ!

రామ్ సినిమాలో విలన్ గా తమిళ స్టార్ హీరో..!

వీళ్లు మారరు.. దెయ్యం పట్టిందని యువకుడిని కొట్టి చంపిన భూతవైద్యుడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -