Wednesday, May 15, 2024
- Advertisement -

స్పేస్ వార్‌కు భార‌త్ సిద్దంగా ఉంది…. ప్ర‌ధాని మోదీ

- Advertisement -

ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దేశ భద్రత అంశంపై కీల‌క ప్రకటన చేశారు. స్పేస్ వార్‌కు భార‌త్ సిద్దంగా ఉంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతరిక్షంలో కాలం చెల్లిన ఓ శాటిలైట్ ను కూల్చివేశామని, ఇంత టెక్నాలజీని సాధించిన శాస్త్రవేత్తలను అభినందిస్తున్నానని… ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ అంశమన్నారు. లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోని ఈ లైవ్ శాటిలైట్ ను ఏ-శాట్ (యాంటీ శాటిలైట్) మిసైల్ ద్వారా కేవలం మూడు నిమిషాల వ్యవధిలో కూల్చేశామని అన్నారు. ఈ ఆపరేషన్ విజయవంతమైందని, ‘మిషన్ శక్తి’ పేరిట ఇది జరిగిందని అన్నారు. ఇది అత్యంత క‌ఠిన‌మైంద‌న్నారు. దీనికి ఎంతో టెక్నిక్ అవ‌స‌ర‌మ‌ని, కానీ శాస్త్ర‌వేత్తలు దీన్ని స‌మ‌ర్థింగా చేశార‌న్నారు. దీని ద్వారా అంత‌రిక్ష‌రంగంలో భార‌త్ స‌త్తా మ‌రో సారి చాటార‌న్నారు. భ‌విష్య‌త్తు ల‌క్ష్యాల‌ను అందుకునేందుకు ఆధునిక టెక్నాల‌జీని ఆహ్వానించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అంత‌రిక్ష శ‌క్తిగా భార‌త్‌కు గుర్తింపు ఉంద‌ని, అమెరికా, ర‌ష్యా, చైనా స‌ర‌స‌న ఇప్పుడు దేశం నిలిచింద‌న్నారు. ఏదైనా లొకేష‌న్ల‌పై శాటిలైట్ స్పై చేస్తే.. దాన్ని యాంటీ శాటిలైట్‌తో పేలుస్తారు. అయితే ఈ ప్ర‌క్రియ‌ను కేవ‌లం మూడు నిమిషాల్లోనే ఆ శాటిలైట్‌ను పేల్చేస్తారు. లోయ‌ర్ ఆర్బిట్‌లో ఏదైనా ఉప‌గ్ర‌హం సంచ‌రిస్తే, దాన్ని ఇప్పుడు ఇండియా పేల్చ‌య‌గ‌ల‌దు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -