Friday, March 29, 2024
- Advertisement -

మహేష్ బ్యాంకుపై సైబర్ నేరగాళ్ల దాడి.. రూ. 12 కోట్లు దారిమళ్లింపు

- Advertisement -

హైదరాబాద్ నగరంలో పైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. ప్రతి రోజు పెద్ద మొత్తంలో సైబర్ మోసాలు నమోదవుతన్నాయి. తాజాగా మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకు అకౌంటును కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఏకంగా రూ.12 కోట్లను దారి మళ్లించారు.

హైదరాబాద్ లోని బేగంబజారులో మహేష్ కోపరేటివ్ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఉంది. ఈ బ్యాంకులో వ్యాపారులు ఎక్కువగా తమ డబ్బులను పెద్ద మొత్తంలో ఉంచుతారు. కాగా ఒక్కసారిగా బ్యాంకు మూలధనంలో తేడా వచ్చినట్టు సిబ్బంది గమనించారు.

తీరా గమినించాక వారి మైండ్ బ్లాంక్ అయింది. బ్యాంకులోని రూ.12 కోట్లను సైబర్ నేరగాళ్లు లూటీ చేశారు. దీనిపై బ్యాంకు ఉన్నతాధికారులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే మూడు ఖాతాల్లోకి ఈ డబ్బును మల్లించినట్టు పోలీసులు గుర్తించారు. ఎవరు ఈలూటీకి పాల్పడ్డారు. ఇందులో బ్యాంకు సిబ్బంది ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also Read: తెలంగాణలో కర్ప్యూ పై ప్రభుత్వం కీలక నిర్ణయం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -