జగిత్యాల జిల్లాలోని కోరుట్ల బస్‌స్టాండ్‌లో బుర్ఖా ధరించిన ఓ వ్యక్తి పట్టుబడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. మహిళల విభాగంలో కూర్చున్న వ్యక్తిని సిబ్బంది గమనించి అనుమానంతో ప్రశ్నించారు. ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా చిరునవ్వుతో తప్పించుకున్నట్లు సమాచారం.
ఆ వ్యక్తి బుర్ఖా ధరించడానికి గల కారణం స్పష్టంగా తెలియరాలేదు. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినదా లేదా ఇతర ఉద్దేశ్యమా అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో కొంతసేపు బస్‌స్టాండ్‌లో ఉద్రిక్తత నెలకొంది.
పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మతపరమైన దుస్తులను దుర్వినియోగం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో బస్‌స్టాండ్‌లలో మెరుగైన భద్రతా పర్యవేక్షణ చేపట్టాలని.. ప్రజల భద్రతను కాపాడే చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు. అధికారులు ఈ అంశాన్ని పరిశీలించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకునే అవకాశముంది.
