- Advertisement -

వ‌న జాత‌ర‌కు వెళ్లొద్దామా?

- Advertisement -

నాలుగు రోజుల పాటు మేడారం జాత‌ర‌

వ‌న దేవ‌త‌ల జాత‌ర ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాత‌ర‌. దీన్నే తెలంగాణ గిరిజ‌న కుంభ‌మేళా నేడు పేరు పొందుతోంది. రెండేళ్లకోసారి జ‌రిగే ఈ అడవి బిడ్డల పండుగకు ప్ర‌పంచం నుంచి భ‌క్తులు పోటెత్తుతారు. దేశంలో ఎక్కడెక్కడో ఉండే ఆదివాసీలతో పాటు కోటిమంది భక్తులు తరలివచ్చే అపురూప‌మైన నాలుగు రోజుల దివ్య‌మైన జాత‌ర‌. జ‌న‌వ‌రి 31వ తేదీ నుంచి మొద‌లుకొని ఫిబ్ర‌వ‌రి 3వ తేదీ వ‌ర‌కు జాత‌ర కొన‌సాగుతోంది. తాడ్వాయి మండ‌లం మేడారంలో కొలువైన స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ గ‌ద్దెల వ‌ద్ద ల‌క్ష‌లాది మంది భ‌క్తులు త‌ర‌లివ‌చ్చే అపురూప దృశ్య‌కావ్యం ఇది. ఈ జాత‌ర కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ఏర్పాట్లు, కార్య‌క్ర‌మాలు చేస్తోంది.

జంప‌న్న వాగులో పుణ్య‌స్నానం చేసి అమ్మ‌వారి గ‌ద్దెల‌ను ద‌ర్శించుకోవాలి. అక్క‌డ నిలువెత్తు బంగారం (బెల్లం) స‌మ‌ర్పిస్తారు. త‌మ కోర్కెలు తీరిన వాళ్లు బంగారం ఇస్తారు. అనంత‌రం గ‌ద్దెల వ‌ద్ద ఒడిబియ్యం, చీర‌సారెలు అందించ‌డం, టెంకాయ‌లు క‌ట్ట‌డం వంటివి చేస్తుంటారు. పిల్ల‌లు లేని దంప‌తులు అమ్మ‌ల‌ను ద‌ర్శించుకుంటే వెంట‌నే ప్ర‌తిఫ‌లం ఉంటుంద‌ని భ‌క్తుల న‌మ్మ‌కం.

హైద‌రాబాద్ నుంచి మేడారం మొత్తం 230 కిలో మీట‌ర్లు ఉంటుంది. హైద‌రాబాద్ నుంచి వ‌రంగ‌ల్ 130 కిలోమీట‌ర్లు. అక్కడి నుంచి మేడారం 100 కిలోమీట‌ర్లు. హైద‌రాబాద్ నుంచి మేడారం గ్రామానికి నేరుగా ర‌వాణా స‌దుపాయాలు ఉన్నాయి. మేడారం వెళ్లిన వారు వ‌రంగ‌ల్ జిల్లాలోని ప‌లు సంద‌ర్శ‌నీయ స్థలాల‌ను కూడా ద‌ర్శించుకోవ‌చ్చు. రామ‌ప్ప గుడి, ల‌క్న‌వ‌రం, కోట‌ప్ప గుళ్లు, పాండ‌వుల గుళ్లు, బొగ‌త జ‌ల‌పాతం, కాళేశ్వ‌రం ఆల‌యం, తాడ్వాయి అట‌వీ ప్రాంతం త‌దిత‌ర ప్రాంతాలు చూడ‌వ‌చ్చు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -