Friday, April 19, 2024
- Advertisement -

ఎమ్మెల్యే బాల్క సుమన్ కు పితృవియోగం…

- Advertisement -

చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి బాల్క సురేష్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న సురేశ్ హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్ పార్టీ సహచరుడ్ని పరామర్శించారు.

బాల్క సురేష్ మృతిపట్ల పలువురు టీఆర్‌ఎస్ పార్టీ నేతలు సంతాపం తెలిపారు. బాల్క సుమన్ తండ్రి బాల్క సురేష్ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. గతంలో మెట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మ‌న్‌గా పనిచేసిన సురేష్ టీఆర్ఎస్ పార్టీ క్రియాశీల నాయకుడిగా చురుకైన పాత్రపోషించారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

2014 ఎన్నికల్లో బాల్క సుమన్.. పెద్దపల్లి లోక్‌సభ నియోజకర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన సుమన్.. ఎమ్మెల్యేగా గెలుపొందారు.

రొమాంటిక్ మూడ్ లో హైపర్ ఆది..ఏకంగా హగ్గులతో రచ్చ!

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలకృష్ణ

ఆ హీరోతో డేటింగ్ చేయాలని ఉంది: రష్మిక

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -