Tuesday, May 7, 2024
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా పోతుందా

- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంకట పరిస్ధితిని ఎదుర్కొంటోంది. ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ చేరడంతో మొదటికే మోసం వచ్చేలా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ 21 మంది ఎమ్మెల్యేలుండేవారు. అయితే ఏడుగురు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరడంతో ఇప్పుడు ఆ పార్టీలో 14 మంది ఎమ్మెల్యేలే మిగిలారు.

వీరిలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్ అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా పోతుంది. ఇటీవలే మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మెహన్ రెడ్డి టిఆర్ఎస్ చేరారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు అదే బాటలో ఉన్నారని పార్టీలో చర్చించుకుంటున్నారు.

త్వరలో జరుగనున్న టిఆర్ఎస్ ప్లీనరీ నాటికి ఈ తంతు కూడా పూర్తి అవుతుందని పార్టీలో కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగి ప్రధాన ప్రతిపక్ష హోదా చేజారితే సోనియా గాంధీ దగ్గర తల ఎత్తుకునే పరిస్థితి ఉండదని కాంగ్రెస్ నాయకులు బెంబేలెత్తుతున్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -