- Advertisement -

తల్లిదండ్రులు బిడ్డ కు ఇచ్చే ఆస్తి చదువే…

- Advertisement -

విద్యా సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బడిఈడు పిల్లలందరికీ ఈరోజు జగనన్న విద్యా కానుక పంపిణీ ప్రారంభమైంది. శింగనమల నియోజకవర్గం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య గారు, ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారు, ఎమ్మెల్సీ‌ శమంతకమణి గారు పాల్గొన్నారు.

పద్మావతి గారు మాట్లాడుతూ పేదరికంలో పుట్టడం తప్పు కాదు, పేదరికంలో చచ్చిపోవడం పెద్ద తప్పు అని అన్నారు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదని, చదువు మాత్రమే పేదరికాన్ని నిర్మూలిస్తుందని, ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎపుడూ చెబుతూ ఉంటారని గుర్తు చేశారు.

విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అందరి భవిష్యత్తు బాగుండాలని జగన్ మామ జగనన్న విద్య కానుక అందించడం సంతోషంగా ఉందని, అందరూ బాగా చదివి ఉన్నత స్థాయికి వెళ్లడం ద్వారా జగన్ మామకు గిఫ్ట్ ఇవ్వాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు రూ.650 కోట్ల ఖర్చుతో ఈ బృహత్తర పథకాన్ని జగనన్న ప్రారంభించారని తెలిపారు.

విద్యా కానుక కిట్లలో మొత్తం ఏడు వస్తువులు (మూడు జతలయూనిఫాం, రెండు జతల సాక్సులు, బూట్లు, స్కూల్ బ్యాగ్,‌ నోట్ పుస్తకాలు, టెక్స్ట్ బుక్కులు, మూడు మాస్కులు ) ఉంటాయని తల్లిదండ్రులకు వివరించారు.

అందరికీ ఒక విషయం చెప్పాలి అంటూ ఆలూరు సాంబశివారెడ్డి గారు కూడా ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే చదివి ఇప్పుడు రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈవోగా నియమితులయ్యారు అందుకు గర్వంగా ఉందని ఎమ్మెల్యే పద్మావతి గారు చెప్పారు.

అనంతరం శింగనమల ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని ఎంపీ మరియు ఎమ్మెల్సీ గార్లతో కలిసి ప్రారంభించారు. కస్తూర్బా పాఠశాలలో నాడు-నేడు పనులను పరిశీలించి నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు చేయాలని కాంట్రాక్టర్లకు తెలియజేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -