Thursday, May 2, 2024
- Advertisement -

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి: జొన్నలగడ్డ

- Advertisement -

అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రివర్యులు, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాల గుండ్ల శంకర్ నారాయణ, ఎంపీలు తలారి రంగయ్య , గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సింగనామల నియోజకవర్గ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అధికారులు.

జొన్నలగడ్డ పద్మావతి గారు మాట్లాడుతూ…. స్వదేశీ విత్తనాల సంరక్షణ గురించి తీసుకుంటున్న చర్యలపై వ్యవసాయశాఖ అధికారులను ప్రశ్నించారు. సేంద్రియ వ్యవసాయం, స్వదేశీ విత్తనాలను ప్రోత్సహించడం, మిల్లెట్స్(అపరాలు) ను ప్రోత్సాహిస్తే రైతుకు మేలు జరుగుతుందన్నారు.

మిల్లెట్ బోర్డు ఏర్పాటు చేసి సంవత్సరం అయింది. దాని కార్యకలాపాలను తెలపాలన్నారు. హైబ్రిడ్ సీడ్ వల్ల ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడాల్సి వస్తోంది. కేవలం రసాయన ఎరువుల వాడకం వల్ల సగటున ఒక్కో గ్రామం 16 లక్షల రూపాయలు విదేశాలకు కడుతోంది. క్షేత్రస్థాయిలో మూలల్లోకి వెళ్లి రైతులకు మేలు చేసే అవకాశాల గురించి ఆలోచించాలని సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -