Sunday, May 5, 2024
- Advertisement -

చ‌నిపోతూ బిడ్డ ఆక‌లి తీర్చాల‌ని ఆరాట‌ప‌డిన త‌ల్లి

- Advertisement -
Mother Dead By Tracks, Wailing Infant Tries To Breastfeed

హృద‌యాన్ని క‌లిచివేసే ఘ‌ట‌న ఇది. రాయిలాంటి గుండెను కూడా క‌న్నీరు కార్చేలా చేసే హృద‌య విదార‌క దృశ్యం ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది.ఆసంఘ‌ట‌న ఇప్పుడు సోషియ‌ల్ మీడియాలో వైర‌ల్‌గామారించి.

అమ్మ చనిపోయిందని తెలీని ఓ పసికూన పాలు తాగడానికి ప్రయత్నిస్తున్న సంఘ‌ట‌న ఇప్పుడు అంద‌రిని క‌ల‌చివేస్తోంది.ఈసంఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంది.

{loadmodule mod_custom,Side Ad 1}

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న దామో ప్రాంతంలో గల రైల్వే పట్టాల వద్ద ఓ మహిళ మృతదేహం పడి ఉండటాన్ని కొందరు స్ధానికులు గుర్తించారు.ఆమె చేతిలోని ఏడాది పసిగుడ్డు ఆక‌లితో త‌ల్ల‌డిల్లింది. ఏడుస్తూ.. ఆమెను లేప‌డానికి ప్ర‌య‌త్నిస్తూ.. చ‌నుబాలు తాగి ఆక‌లిని తీర్చుకోవాల‌ని ఆరాట‌ప‌డుతున్న ఆ చిన్నారిని చూసి అక్క‌డున్న ప్ర‌తి ఒక్క‌రూ కంట‌త‌డి పెట్టారు.
స్ధానికుల సమాచారంతో ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెళ్లే రైలు నుంచి మహిళ పడిపోయి ఉండొచ్చని లేదా రైలు ఆమెను ఢీ కొట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. మహిళ తలకు బలమైన గాయం ఉన్నట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత చివరిసారిగా ఆమె బిడ్డకు పాలిచ్చేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు.

{loadmodule mod_custom,Side Ad 2}

త‌ల్లి మృత‌దేహాన్ని ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా …బిడ్డను చిల్డ్రన్స్‌ హోంలో చేర్చేందుకు రూ.10 చెల్లించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో వార్డు బాయ్‌ ఆ డబ్బును చెల్లించి హోంలో చేర్పించాడు. బాలుడికి చెందిన కుటుంబసభ్యులను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మహిళ కుటుంబ సభ్యుల వివరాల కోసం ప్రయత్నిస్తున్నామని వివరించిన పోలీసులు.. ఎందుకైనా మంచిదని ప్రస్తుతం బాలుడ్ని వైద్య పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. గురువారం బాలుడ్ని మరోసారి పరీక్షించిన అనంతరం ప్రమాదం లేదని డాక్టర్లు చెప్తే చైల్డ్ వెల్పేర్ కమిటీకి అప్పగించనున్నట్లు వివరించారు.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}vXdlkHwyPh8{/youtube}

Also Read

  1. ప్రాణాలు తీసె మిర‌ప‌కాయ‌ను సృష్టించిన శాస్త్ర‌వేత్త‌లు
  2. ప‌చ్చిమిర్చి ప్ర‌తీరోజు తీసుకోవ‌డం వ‌ల‌న క‌లిగే ఆరోగ్య లాభాలు
  3. ఆమె రూపొందించిన డ్ర‌స్సుకు ఒ ప్ర‌త్యేక‌త ఉంది…
  4. ఆరోగ్య గ‌ని నేరేడు పండ్లు….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -