Thursday, May 2, 2024
- Advertisement -

కేంద్రం ప్రవేశపెడుతున్న అల్లావుద్దీన్ పథకం

- Advertisement -

కాలం చెల్లిన వాహనాలకు గిరాకి పెరగనుంది. పదకొండేళ్లు దాటిన వాహనాలకు ప్రభుత్వానికి ఇచ్చేస్తే కొత్త వాహనం కొనుగోలు చేసేప్పుడు 8 నుంచి 12 శాతం దాకా ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే చిన్నప్పుడు మనం చదువుకున్న అల్లావుద్దీన్ అద్భుత దీపం కథలా అన్నమాట. కేంద్రానికి హఠత్తుగా ఇంత ప్రేమ ఎందుకనుకుంటున్నారా.

ఏం లేదు పాత వాహనాలను రోడ్డుపై నుంచి తప్పించి పర్యావరణాన్ని పరిరక్షించాలనేది కేంద్రం ఆలోచన. ఇందులో భాగంగానే ఈ నూతన వలంటరీ వెహికల్ ఫ్లీట్ మెడ్రనైజేషన్ ప్లాన్ అనే వి వీఎంసి పథకాన్ని ప్రారంభిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం బాగుందా లేదా.. ఇంకైమా మార్పుల చేయాలా అనేది 15 రోజుల్లోగా తెలియ.ేయాలని ప్రజలను, వాహన తయారీదారులు, డీలర్లను కోరింది కేంద్రం.

2005 సంవత్సరం మార్చి 31 తేది కంటే ముందు కొన్న వాహనాలను వీ వీఎంసి ద్వారా వదులుకోవాలనుకునే యజమానులు వాహనాలతో పాటు వాటి పత్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసే రీ సైక్లింగ్ సెంటర్లలో ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ వారు మీ వాహనానికి ధర నిర్ణయించి వాహనాన్ని తీసుకుని మీ డబ్బు మీకు ఇస్తారు. దీంతో వీ వీఎంసి సర్టిఫికెట్ కూడా ఇస్తారు. అది తీసుకుని కొత్త వాహనం కోసం డీలర్ దగ్గరకు వెళ్లినప్పుడు వీ వీఎంసి సర్టిఫికెట్ చూపిస్తే ప్రభుత్వం ప్రకటించిన రాయితీతో మీకు కొత్త వాహనం వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం. మీ వాహనాలు తీసుకుని బయలుదేరండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -