Friday, May 3, 2024
- Advertisement -

క్ష‌మాప‌ణ చెప్పే ప్ర‌స‌క్తే లేదు….

- Advertisement -
No Sorry If need i will reagan saya JC Diwakar Reddy

శాఖపట్నం ఎయిర్‌పోర్టులో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బందితో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి గొడవ వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.కేంద్ర పౌర‌విమాన‌యాన శాఖ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు ను తెలివిగా ఇరికించారు జేసీ.ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై రిపబ్లిక్‌ టీవీ నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో ఆయ‌న వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

విశాఖపట్నం విమానాశ్రయం వివాదంలో క్షమాపణ చెప్పాల్సి వస్తే పార్టీకి రాజీనామా చేయటానికి అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి సిద్దంగా ఉన్నారు. ఆ విషయాన్ని ఆయనే స్పష్టంగా చెప్పారు. సమయం గడిచిపోయిన తర్వాత విశాఖపట్నం విమానాశ్రయంలో బోర్డింగ్ పాస్ కోసం జెసి చేసిన వీరంగం అందరికీ గుర్తుండే ఉంటుంది.

{loadmodule mod_custom,GA1}

వెంట‌నేకొన్ని దేశీయ విమానయాన సంస్ధలు జెసిని విమాన ప్రయాణం నుండి నిషేంధించాయి. అయితే, విచిత్రమేంటంటే అంత గొడవ జరిగిన తర్వాత కూడా ఎంపి విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు అదే విమానంలో వచ్చేసారు. ఒకవైపు దేశవ్యాప్తంగా జెసి చర్యలపై విమర్శలు వస్తుండగానే కుటుంబంతో కలిసి ప్యారిస్ కు కూడా వెళ్ళిపోయారు.
రిపబ్లిక్ టివి జరిపిన స్టింగ్ ఆపరేషన్లో వివాదం గురించి జెసి మాట్లాడుతూ, ‘జరిగిన వివాదంపై తాను క్షమాపణ చెప్పే ప్రశక్తే లేద’ని తేల్చేసారు. ‘క్షమాపణ చెప్పాల్సిన అవసరమే వస్తే పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళిపోతానే గానీ క్షమాపణ మాత్రం చెప్పనం’టూ స్పష్టంగా చెప్పారు.
ఒకవైపు వివాదానికి ముగింపు పలికేందుకు విమానయాన సంస్ధకు జెసి చేత క్షమాపణ చెప్పించాలని చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి సమయంలో జెసి చేసిన ప్రకటన ఇటు చంద్రబాబును అటు అశోక్ గజపతిరాజును ఒకేసారి ఇరకాటంలోకి నెట్టేసాయి.

{loadmodule mod_custom,GA2}
{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}wWnpSsaZ5-I{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -