Tuesday, April 16, 2024
- Advertisement -

NTR పేరు వద్దు.. YSR పేరే ముద్దు !

- Advertisement -

దివంగత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆయన పరిపాలన సమయంలో ఆంద్రప్రదేశ్ లో ఎన్నో విప్లవాత్మక మార్పులకు తెరతీశారు. ఆయన తొలినాళ్లలో ప్రవేశ పెట్టిన ఎన్నో పథకాలు ఇప్పటికీ కూడా పేరు మార్పుతో కొనసాగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ విషయాన్ని అలా ఉంచితే ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల తరువాత ప్రజాభిప్రాయాన్ని బట్టి ప్రభుత్వాలు మారడం సర్వ సాధారణమే. అయితే అధికరంలోకి వచ్చిన పార్టీ వాళ్ళు గతంలో ఉన్న పథకాలను తీసివేసి కొత్త పథకాలు ప్రవేశ పెట్టడం లేదా అదే పథకాలను తమకు అనుకూలమైన పేర్లతో మార్చుకొని పునః ప్రవేశ పెట్టడం చేస్తూ ఉంటారు.

అయితే ఇది కేవలం పథకాల విషయంలోనే కాకుండా ప్రాముఖ్యం పొందిన ఎన్నో వాటిపై పేర్ల మార్పు కూడా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా తాజాగా జగన్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పోలిటికల్ హిట్ ను పెంచుతోంది. దివంగత ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు ఆయన హయాంలో ప్రవేశ పెట్టిన ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు ను వైఎస్ఆర్ హెల్త్ వర్శిటీ గా పేరు మార్చాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. అంతే కాకుండా దీనికి సంబంధించిన బిల్లును కూడా శాసన సభలో ప్రవేశ పెట్టి సక్సస్ అయింది.

దీంతో ప్రతిపక్ష టిడిపి నేతలు దీనిపై మండి పడుతున్నాడు. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ కి ఆయన పేరు తీసి వైఎస్ఆర్ పేరు పెట్టడం వల్ల ఎన్టీఆర్ ను అగౌరపరచినట్లేనని టిడిపి శ్రేణులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అయితే తమ నిర్ణయాన్ని జగన్ సర్కార్ మాత్రం సమర్థించుకొంది.. దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి స్వతహాగా డాక్టర్ కావడం వల్ల ఆ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టాల్సి వచ్చిందని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. అయితే జగన్ సర్కార్ ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్చడంపై సామాన్యుల్లో మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: మోడీ అంటే అంత నమ్మకమా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -