- Advertisement -
రెండోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు ఓం బిర్లా. ఇండియా కూటమి తరపున బరిలో ఉన్న కే సురేశ్‌పై గెలుపొందారు బిర్లా. మూజువాణి ఓటుతో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాజ్ వెల్లడించారు.
స్పీకర్ గా ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీర్మానం ప్రవేశపెట్టగా ఈ తీర్మానాన్ని రాజ్ నాథ్ సింగ్ తో పలువురు ఎన్డీయే ఎంపీలు బలపర్చారు. ఇండియా కూటమి తరపున కె. సురేష్ పేరును శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం ప్రవేశపెట్టగా తీర్మానాన్ని ఇండియా కూటమి ఎంపీలు బలపర్చారు.
ఇక స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాను ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓం బిర్లాను స్పీకర్ చైర్ లో కూర్చోబెట్టారు. ఓం బిర్లా స్పీకర్ గా ఎన్నిక కావటం ఇది రెండోసారి.
