చంద్ర‌బాబు ప‌రిస్థితితేంటి….?

- Advertisement -
PIL challenges in High Court on Visakha Land Scam

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ జరిగని అతిపెద్ద విశాఖ భూ కుంభకోణంగా చ‌రిత్ర‌లెక్కింది. హుద్‌హుద్‌ తుపానులో రికార్డులు కొట్టుకుపోయాయంటూ కట్టుకథలు అల్లి.. దాదాపు 20వేల ఎకరాల భూమిని టీడీపీ మంత్రి, ఐదుగురు ఎమ్మెల్యేలు వారి పేర్ల మీదకు రాసేసుకున్నారు.

సీబీఐతో విచార‌న జ‌రిపించాల‌ని ప్ర‌తిప‌క్షాలు ,ప్ర‌జ‌లు మొత్తుకున్నా.. అధికార‌పార్టీ ఎదురుదాడి మొద‌లు పెట్టింది.
అయితే సీబీఐ ఎంక్వ‌యిరీ ద్వారా అయితే ఎక్క‌డ త‌మ‌పార్టీ నాయ‌కుల బండారం బ‌య‌ట‌ప‌డుతుందోన‌ని సీఐడీ విచార‌న‌కు ఆదేశించి చేతులు దులుపుకున్నారు సీఎం చంద్ర‌బాబు. అయితే ఇప్పుడు ప్ర‌భుత్వానికి షాక్ త‌గిలింది. తాజాగావైజాగ్ భూకుంభ‌కోణం వ్య‌వ‌హారం మ‌రో మలుపు తిరిగింది.
దేశంలోనే జ‌రిగిని ఈ కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ విజయవాడ మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్‌… హైకోర్టులో పిల్‌ వేశారు. అధికార పార్టీ నేతలు, అధికారులు, పలుకుబడి ఉన్న పెద్దలు కుమ్మక్కు అయి భూకుంభకోణం చేశారని వివరించారు. భీమునిపట్నం, పరవాడ, పెందుర్తితో పాటు విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో ల్యాండ్ స్కాం విస్తారంగా జరిగిందని పిల్‌లో వివరించారు.
దీనికి సంబందించి తెలుగు, ఆంగ్ల పత్రికల్లో కుంభకోణానికి సంబంధించి వచ్చిన సంచలన కథనాలను కూడా పిల్‌కు జతచేశారు. రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసే సిట్‌ వల్ల నిజాలు బయటకువచ్చే అవకాశమే లేదు కాబట్టి సీబీఐ విచారణకు ఆదేశించాలని అడుసుమిల్లి కోరారు.మ‌రి హైకోర్టు సీబీఐకి ఆదేశిస్తే బాబు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.

- Advertisement -

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}8xgiuw7xDNs{/youtube}

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -