Thursday, April 18, 2024
- Advertisement -

మొద‌టినుంచి గంటాచుట్టూ తిరుగుతున్న భూ కుంభ‌కోణం ఆరోప‌న‌లు….

- Advertisement -
Ganta Srinivasa Rao spar over Vishaka Land Scam..?

విశాఖ‌లో ల‌క్షఎక‌రాల భూకుంభ‌కోనంలో గంటా చుట్టూ నే తిరుగుతున్నాయి.మొద‌టి నుంచి ఆయ‌న‌పైనే ప్ర‌ధానంగా ఆరోప‌న‌లు వెల్లువెత్తుతున్నాయి.ఆయ‌న ఎక్క‌డున్నా వివాదాస్ప‌ద‌మే అవుతోంది.

గంటాకు వ్యాపారాలు,రాజ‌కీయాలు రెండు కళ్లులాంటివి.ఒక విధంగా ఆయ‌న ప‌వ‌ర్ బ్రోక‌ర్ అనే చెప్పాలి.త‌న సొంత వ్యాపారాల‌కోసం ఎంత‌కైనా తెగిస్తార‌ని అందుకు రాజ‌కీయాన్ని వాడుకుంటారనే ఆరోప‌న‌లు ఉన్నాయి.

{loadmodule mod_custom,GA1}

ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవటం, సొంతభూములుగా చెప్పుకుని బ్యాంకుల్లో కుదవపెట్టి కోట్లరూపాయలు రుణాలు తీసుకోవటం గంటాకు మామూలు. ఈ విషయం గతంలోనే రుజువైంది. అయినా ఆయనపై చర్యలు తీసుకోవటానికి చంద్రబాబునాయుడుడ వెనకాడుతున్నారు
విశాఖపట్నంలో అల‌జ‌డిరేపుతున్న భూ కుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఇరుక్కున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. వైసీపీ వర్గాలు చెబుతున్నదాని ప్రకారం అలానే అనిపిస్తోంది. భూకుంభకోణం మొత్తం మొదటినుండి గంటా కేంద్రంగానే తిరుగుతోంది. గంటాతో పాటు మరో ఐదుగురు ఎంఎల్ఏలున్నప్పటికీ గంటానే కుంభస్ధలంగా వైసీపీ భావిస్తోంది.
తాజా వివరాల ప్రకారం గంటా బావమరిది భాస్కర్ రావు, అల్లుడు ప్రశాంత్ పేర్లను తెరపైకి వైసీపీ తెచ్చింది. గంటా ప్రతీ వ్యాపారం వెనుక, ప్రతీ అక్రమం వెనుకా బావమరదే ఉన్నాడన్నది వైసీపీ ఆరోపణ. తాజాగా అల్లుడు ప్రశాంత్ కూడా తోడయ్యారు.

{loadmodule mod_custom,GA2}

ఇప్పటి భూకుంభకోణంపై ప్రభుత్వం వేసిన ‘సిట్’ విచారణలో గంటా పూర్తిగా ఇరుక్కున్నట్లే కనబడుతోంది. ఎందుకంటే, కుంభకోణంపై రెండు రకాల విచారణలు జరుగుతున్నాయి. ఒకటి కలెక్టర్ ద్వారా రెవిన్యూ అధికారులు జరుపుతున్న విచారణైతే, రెండోది సిట్. కలెక్టర్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో గంటా బావమరది పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారని సమాచారం. ఇవ‌న్నీ చూస్తె గంటాకు బ్యాడ్‌టైం స్టార్ట్ అయిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

{youtube}TDpyVeCXAug{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -