Saturday, April 20, 2024
- Advertisement -

మోడీ పాలన.. బ్రిటిషర్ల పాలన ఒకటేనా ?

- Advertisement -

నరేంద్ర మోడి భారత ప్రధానిగా రెండు సార్లు ఎన్నికయ్యి.. ఎనిమిదేళ్లుగా పదవి భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఎనిమిదేళ్ళలో ఎన్నో సంస్కరణలను, ఎన్నో సరికొత్త విధానాలను మోడి దేశంలో ప్రవేశ పెట్టారు. అంతే కాకుండా ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. అయితే ప్రధాని మోడి తీసుకునే ఏ నిర్ణయమైన కూడా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించే విధంగా ఉంటూ వస్తోంది. నోట్ల రద్దు విషయంలోనైనా, అలాగే 360 ఆర్టికల్ రద్దు విషయంలోనైనా, సర్జికల్స్ స్ట్రైక్స్ విషయంలోనైనా.. ఇలా చాలా విషయాలలో ప్రధాని మోడి తీసుకున్న నిర్ణయాలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

అయితే ప్రధాని మోడి చేపట్టిన చాలా విధానాల పట్ల సానుకూలత కంటే తీవ్ర స్థాయిలో వ్యతిరేకతనే ఎక్కువగా వస్తూండడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా నోట్ల రద్దు విషయంపై, అలాగే జి‌ఎస్‌టి విధానంపై ఇప్పటికీ కూడా మోడి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తూనే ఉంది. ఇక తాజాగా మరోసారి జి‌ఎస్‌టి పన్నుల శాతం పెంచుతున్నట్లు కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ జి‌ఎస్‌టి పెంపుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నాయి. జి‌ఎస్‌టి పేరుతో ప్రజల సొమ్ము మోడి దోచుకుంటున్నారని అన్నీ వైపులా విమర్శలు వస్తున్నే ఉన్నాయి.

ఇక తాజాగా మోడి పాలనను బ్రిటిష్ పాలనతో పోల్చాడు అరవింద్ కేజ్రివాల్, ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యవసర వస్తువులు, పాలు, పెరుగు, గోదుమలు, బియ్యం వంటి ఆహార పదార్థాలపై కూడా కేంద్ర ప్రభుత్వం జి‌ఎస్‌టి పన్ను విధించడం దారుణమని, ఇలాంటి చర్యలు బ్రిటిష్ పరిపాలనలో మాత్రమే జరిగేవని కేజ్రివాల్ అన్నారు.. ప్రస్తుతం కేజ్రివాల్ చేసిన ఈ వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో బాగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే మన దేశంలో దుర్మార్గమైన అక్రమ పరిపాలన సాగించిన సాగించిన బ్రిటిషర్ల పాలనతో మోడీ ప్రభుత్వాన్ని పోల్చడం కొంత వివాదాన్ని కలిగించే అంశమే. మరి కేజ్రివాల్ చేసిన ఈ వ్యాఖ్యలపై కమలనాథులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Also Read

దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయా ?

ఇండియాను విడిచిపెడుతున్న భారతీయులు !

మన జాతీయ జెండా కూడా చైనాదే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -