తెలంగాణలో రాజకీయం ఇక రసవత్తరం..‌

- Advertisement -

బైపోల్స్ ఎప్పడు సెమీ ఫైనల్స్ .. అసెంబ్లీ ఎన్నికలు మాత్రం పైనల్స్ గా రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి. ఏ రాష్ట్రంలో అయినా బై పోల్స్ ఎప్పుడు జరిగినా , అధికారంలో ఉన్న పార్టీ లదే హవా.. అందుకు బిన్నంగా ప్రజా తీర్పు వస్తే మాత్రం ,ఇక పైనల్స్ లో కూడా అధికార పార్టీ కి అవకాశాలు తగ్గినట్టుగా భావించాల్సిందే.. హుజురాబాద్ ఎన్నికల రిజల్ట్ అనంతరం , బిజెపి శ్రేణుల ఉత్సాహం మరింత పెరగటానికి ఇదే కారణం.. దుబ్బాక ,జిహెచ్ఎంసి , హుజురాబాద్ ల విజయాలతో బిజెపితో పాటు ముఖ్యంగా కేసిఆర్ అంటే పడని వారు , పార్టీలతో సంబంధం లేకుండా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

పైకి కేటిఆర్, హరీష్ రావు లు , ఇవి మాకు పెద్ద మ్యాటర్ కాదంటూ కవర్ డ్రైవ్ వెస్తున్నా, నాగార్జునసాగర్ ఎన్నికలలో టిఆర్ఎస్ గెలిచినప్పుడు మాత్రం ప్రజాదరణ మాకే ఉందంటూ తెగ హడావుడి చేశారు.. తెలంగాణ సమాజంలో మెజారిటి ప్రజలు, నేడు టిఆర్ఎస్ ఓటమిని ఆనందిస్తున్నారంటే .. దానికి కేసిఆర్ కుటుంబం మీద వచ్చిన నెగిటివినే.. దాన్ని తమకు పాజిటివ్ గా మార్చుకొవటంలో బిజెపి 99% సక్సెస్ అవుతోంది.. అందుకే ఇకముందు తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారనుంది..!!

- Advertisement -

బిజెపి : టిఎస్ లో బేష్ .. ఎపి లో తుస్ ..

క్రిప్టో మాయ‌లో ప‌డి యువ‌త ఏం చేస్తున్నారో తెలుసా

టిఆర్ఎస్ కు ఫ్యూచ‌ర్ క‌నిపిస్తుందా..

డ్రాగన్ ఫ్రూట్ తో ఇన్ని లాభాలా?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -