Thursday, April 18, 2024
- Advertisement -

మానవత్వం చాటుకున్న పోలీస్..

- Advertisement -

ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతగా భయపెడుతుందీ అంటే.. కరోనాతో మరణించిన వారిని తీసుకు వెళ్లేందుకు భయపడి అనాధలుగా వదిలి వేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఓ పోలీస్ కానిస్టేబులు మనవత్వాన్ని ప్రదర్శించారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ మహళా ఎస్ఐ శిరీష అనాధ మృతదేహాన్ని తన భుజంపై మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకువెళ్లడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో డీజీపీ గౌతమ్ సవాంగ్ స్వయంగా అభినందించిన సంగతి తెలిసిందే.

ఆ తరువాత విశాఖ జిల్లాలో ఎస్ఐ అరుణ్ కిరణ్ కూడా ఓ అనాధ శవాన్ని తన సిబ్బందితో కలిసి భుజాన మొసుకుని ఆసుపత్రికి తరలించారు. తాజాగా ప్రకాశం జిల్లా డోర్నాల హెడ్ కానిస్టుబుళ్లు దట్టమైన అడవి ప్రాంతం నుండి అనాధ శవాన్ని రెండు కిలోమీటర్ల దూరం భుజాలపై మోసుకొని గ్రామానికి తీసుకువచ్చి విధుల్లో మానవత్వం ప్రదర్శించారు.

సుమారు 50-60 మధ్య వయస్సు గల ఒక యాచకుడు చనిపోయి ఉన్నట్లు గమనించిన గ్రామస్తులు విషయాన్ని పోలీసు స్టేషన్ కు తెలిపారు. అక్కడ యాచకుడి మృతదేహాన్ని చూసి మానవత్వంతో శవాన్ని హెడ్ కానిస్టేబుల్ స్ధానికుడి సహాయంతో ఒక కర్రకు కట్టుకొని స్వయంగా తమ భుజాల మీద మోసుకొని గ్రామానికి తీసుకొని వచ్చారు. శవ గుర్తింపు నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీలో ఉంచారు. హెడ్ కానిస్టేబుళ్లను ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్ అభినందించారు.

ఇజ్రాయిల్ పవిత్ర స్థలం వద్ద ఘోరం.. తొక్కిసలాటలో 44 మంది మృతి!

ఫిబ్రవరి వరకు అప్రమత్తంగా ఉండాలి : సీఎం వైఎస్ జగన్

స్టార్ డైరెక్టర్ కేవీ ఆనంద్ కన్నుమూత!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -