- Advertisement -

భారతీయ వస్త్రాలపై 18శాతం సుంకమా?

- Advertisement -

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో తీవ్ర విమర్శలు చేశారు. భారతీయ వస్త్రాలపై 18 శాతం సుంకం విధిస్తూ, అమెరికా పత్తిని ఉపయోగించినపుడే బంగ్లాదేశ్‌కు 0 శాతం సుంకం వర్తింపజేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. ఈ విధానం దేశీయ పత్తి రైతులకు, వస్త్ర పరిశ్రమకు తీవ్రమైన నష్టం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.

అమెరికా పత్తిని పెద్దఎత్తున దిగుమతి చేసుకోవాల్సి వస్తే మన పత్తి రైతులు నాశనమవుతారని, అదే సమయంలో దేశీయ పత్తిని వినియోగిస్తే భారత వస్త్రాలకు అధిక సుంకభారం పడుతుందని రాహుల్ గాంధీ అన్నారు. ఇరువైపులా భారత ఆర్థిక వ్యవస్థకు దెబ్బతగిలేలా ఒప్పందం రూపొందించబడిందని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం లక్షలాది కుటుంబాల జీవనోపాధిని పణంగా పెట్టిందని, దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా వస్త్ర పరిశ్రమలు, పత్తి రైతులు ఈ ఒప్పందం వల్ల సంక్షోభంలో పడే ప్రమాదం ఉందన్నారు. దేశ ఆర్థిక ప్రయోజనాలు, రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఒప్పందాలను పునర్విమర్శించాలని రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -