Monday, May 6, 2024
- Advertisement -

రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్ ఇవే కేటీఆర్ సీక్రెట్స్..!

- Advertisement -

తెలంగాణ సర్కార్​ సాగు, తాగు నీటికి ప్రాధాన్యతనిస్తోందని పురపాలక మంత్రి కేటీఆర్ అన్నారు. 2050 ఏడాది నాటికి హైదరాబాద్ మహానగర విస్తీర్ణమెంత ఉన్నా.. జనాభా ఎంత పెరిగినా.. అందరికీ సరిపడా నీటిని సరఫరా చేసేందుకు కేశవాపూర్ వద్ద రూ.4,700 కోట్లతో రిజర్వాయర్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ రిజర్వాయర్ నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని వెల్లడించారు. మరోవైపు సుంఖిశాల నుంచి రూ.1,450 కోట్లతో మరో లైన్ ద్వారా నగరానికి నీరు సరఫరా చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్​లో ప్రజలకు 20వేల లీటర్ల నీరు ఉచితంగా అందించడానికి ప్రణాళికలు సిద్దం చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు. దీనికోసం ఎంపానల్ ఏజెన్సీల ద్వారా ఇంటింటికి వెళ్లి పథకం గురించి వివరించి మీటర్లు బిగిస్తున్నారని చెప్పారు. ఈ మీటర్లతో దాదాపు 90 శాతం మందికి ఉచితంగా నీరందించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 7 లక్షల కుటుంబాలకు 2.29 లక్షల కనెక్షన్లను ఇచ్చినట్లు వివరించారు.

ప్రజల సౌకర్యం కోసం మీటర్ల బిగింపు కోసం ఏప్రిల్ చివరి వరకు గడువు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేశారు.వేసవి వచ్చినందున ప్రజలంతా నీటిని పొదుపుగా వాడుకోవాలని మంత్రి సూచించారు. హైదరాబాద్ మరో చెన్నైగా మారకూడదంటే నీరు వృథా చేయొద్దని చెప్పారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. నీటిని రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్ పద్ధతిలో వినియోగించి సంరక్షించుకోవాలని సూచించారు.

భలే ఛాన్స్ లే..కొత్తవాళ్లకు కూడా పింఛన్లు..!

రేచీకటి సమస్య నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

భాగ్యనగరం బెంబేలు.. మహమ్మారి విజృంభణ..!

స్వల్పంగా తగ్గిన బంగారం ధ‌ర‌లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -