Saturday, April 20, 2024
- Advertisement -

హ‌రిద్వార్ కుంభ‌మేళలో అద్భుతం.. నీటిపై తేలుతున్న రాళ్లు

- Advertisement -

ప్రకృతిలో అంతుచిక్క‌ని ర‌హ‌స్య‌లు ఇప్ప‌టికీ ఎన్నో ఉన్నాయి. అప్పుడ‌ప్పుడు అవి మ‌నుషులకు క‌నిపించి.. మాన‌వ మేధ‌స్సుకు స‌వాలు విసురుతుంటాయి. ఎంటో క‌నుక్కోమ్మ‌ని. అయితే, ఇప్ప‌టికీ అనేక విష‌యాలు ప‌రిశోధ‌కులకు సైతం అంతు చిక్క‌కుండా ఉన్నాయి. తాజాగా నీటిపై తేలుతున్న రాళ్లు క‌నిపించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌కితుల‌ను చేస్తున్నాయి.

వివ‌రాల్లోకెళ్తే.. ఉత్తరాఖండ్‌లోని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక కేంద్ర‌మైన హ‌రిద్వార్‌లో ప్ర‌స్తుతం కుంభ‌మేళ జ‌రుగుతోంది. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూనే భారీ సంఖ్య‌లో ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు. అయితే, తాజాగా అక్క‌డి గంగా న‌దిలో భ‌క్తులు పుణ్య‌స్నానం ఆచ‌రిస్తున్న వేళ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన దృశ్యం క‌నువిందు చేస్తోంది. గంగాన‌దిలో తేలియాడుతున్న రాళ్లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

ఇప్పుడు నీటిలో తేలియాడుతున్న రాళ్ల‌ను చూసేందుకు భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో అక్క‌డి క్యూ క‌డుతున్నారు. నీటిపై తేలుతున్న ఈ రాళ్ల‌ను రామ‌సేతు నిర్మాణంలో ఉప‌యోగించార‌ని పేర్కొంటున్నారు. కాగా, పురాణ ఇతిహాస‌మైన రామాయణంలోని యుద్ధకాండలో రామసేతు నిర్మాణం గురించిన ప్రస్తావన ఉంది. సీత కోసం లంకకు వెళ్లడానికి రాముడు తన సైన్యం తో నిర్మించిన వారధినే రామ‌సేతుగా పేర్కొన్నారు.

టీఆర్ఎస్‌కు ఓటమి భయం పట్టుకుంది: బండి సంజ‌య్

భారత తదుపరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా సుశీల్ చంద్ర

దేశంలో కరోనా ఉధృతి.. ఒకే రోజు 1.68 ల‌క్ష‌ల మందికి పాజిటివ్

మాస్కులు ధరించని వారిపై పోలీసులు కొరడా !

అల్లు అర్జున్ పుష్ఫ.. ఆ టైంకు వ‌చ్చేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -