Thursday, March 28, 2024
- Advertisement -

తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్

- Advertisement -

తెలుగువారి మొదటి పండుగ ఉగాది. ఈ పండుగ రోజున కొత్తగా పనులు ప్రారంభిస్తే అంతా మంచే జరుగుతుందని అంద‌రికీ నమ్మకం. ఈ రోజున షడ్రుచుల సమ్మేళనం – తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడిని తెలుగువారు ప్రత్యేకంగా తయారు చేసి స్వీకరిస్తారు. ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

తెలుగు సంవత్సరాది ఉగాది (ఏప్రిల్ 13) సందర్భంగా కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలుపుతూ… ప్లవ నామ సంవత్సరంలో తెలంగాణ వ్యవసాయ రంగానికి సాగునీరు మరింత సమృద్ధిగా లభించనుంద‌ని తెలిపారు. అలాగే, ప్రభుత్వ లక్ష్యానికి ప్రకృతి కూడా తోడు కావడం శుభసూచకమని వెల్ల‌డించారు. రైత‌న్న‌ల పండుగ ఉగాది పేరుగాంచింద‌న్నారు.

అన్న‌దాత‌లు వ్యవసాయానికి ముందస్తు ఏర్పాట్లను ఉగాది పండుగ సందర్భంగానే ప్రారంభిస్తారన్నారు. రైతులను వ్యవసాయానికి సంసిద్ధం చేసే ష‌డ్రుచుల ఉగాది పండుగ‌.. రైతుల‌ జీవితంలో ఓ భాగమైపోయిందన్నారు. రాష్ట్ర ఉమ్మడి పాలనలో చేదు అనుభవాలను చవిచూసిన తెలంగాణ వ్యవసాయరంగం ఇప్పుడు స్వయంపాలనలో మధుర ఫలాలను అనుభవిస్తోందని కేసీఆర్ పేర్కొన్నారు.

హ‌రిద్వార్ కుంభ‌మేళలో అద్భుతం.. నీటిపై తేలుతున్న రాళ్లు

టీఆర్ఎస్‌కు ఓటమి భయం పట్టుకుంది: బండి సంజ‌య్

భారత తదుపరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా సుశీల్ చంద్ర

దేశంలో కరోనా ఉధృతి.. ఒకే రోజు 1.68 ల‌క్ష‌ల మందికి పాజిటివ్

మాస్కులు ధరించని వారిపై పోలీసులు కొరడా !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -