Thursday, April 25, 2024
- Advertisement -

“మావి ఉచితలు కాదు” అంటున్న జగన్ సర్కార్ !

- Advertisement -

ఇటీవల ఉచిత పథకాలపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చలు జరుగుతున్నా సంగతి తెలిసిందే. దేశ అభివృద్దికి ఉచిత పథకాలు అడ్డుకట్ట వేస్తాయని, ఉచిత పథకాలను బహిష్కరించాలని ఆ మద్య ప్రధాని నరేంద్ర మోడి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఉచిత పథకాలపై అగ్గి రాజుకుంది. ఇక అప్పటి నుంచి ఉచిత పథకాలు ఏవి? అనుచిత పథకాలు ఏవి అనే దానిపై రాజకీయ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ప్రజలకు అందించే విద్యా, వైద్యాన్ని ఉచితల జాబితాలోకి చేర్చవొద్దని కొందరు వాదిస్తుంటే.. అసలు ఉచితపథకాలు కానివి ఏవో చెప్పాలంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ ఉచిత పథకాల అంశం సుప్రీం కోర్టులో కూడా ప్రస్తావనకు రాగా.. దీనిపై రాజకీయ పార్టీలే స్పష్టత ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆ మద్య చెప్పుకొచ్చింది. కాగా ఎన్నికలకు ముందు పార్టీల నేతలు ఉచిత హామీలు ఇవ్వకుండా అడ్డుకోవాలని కోరుతూ బీజేపీకి సంబంధించిన న్యాయవాది అశ్విని ఉపాద్యాయ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టులో బుదవారం విచారణ జరిగింది. ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇవ్వకుండా అడ్డుకోవడం సాధ్యం కాదని, ఉచితలు అంటే ఏంటో అర్థం వివరించాలని, ప్రజాధనాన్ని సరైన విధానంలో ఖర్చు చేయడమే ప్రధాన అంశం అని జస్టిస్ ఎన్వి రమణ చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఉచితాలపై ఈ స్థాయిలో రచ్చ జరుగుతున్నా నేపథ్యంలో.. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ” తమ ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఉచితాల కిందికి రావని ” వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి సుప్రీం కోర్టు లో ఇంటర్వీన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కూడా ఆయన ఈ ఉచితలకు సంబంధించిన ప్రస్తావన తీసుకువచ్చారు. ఏపీ లో తమ ప్రభుత్వం అమలు చేసే ఏ పథకాలు ఉచితాల కిందకు రావని.. అమలౌతున్న పథకాలన్నీ సోషల్ ఇన్వెస్టిమెంట్ కిందకు వస్తాయని ఆ మద్య విజయ్ సాయి రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక తాజాగా ఈ ఉచిత పథకాలకు సంభందించి తమ వాదనలు వినాలని విజయ్ సాయి రెడ్డి సుప్రీం కోర్టు లో పిటిషన్ వేయడం ప్రదాన్యం సంతరించుకుంది. మరి ఏపీలో జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలు ఉచితాలో లేక సోషల్ ఇన్వెస్టిమెంటో మీ ఉద్దేశంలో ఏమంటుకుంటున్నారో చెప్పండి చూద్దాం !

Also Read

తెలంగాణకు శత్రువు మోడీనే !

అర్ధం కానీ “రాహుల్ “.. కాంగ్రెస్ కు తప్పని తిప్పలు !

పవన్ను అందుకే టార్గెట్ చేస్తున్నారా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -