Saturday, April 20, 2024
- Advertisement -

ఏపీ నిధుల దారి మళ్లింపుపై సుప్రీం సీరియస్

- Advertisement -

ఏపీలో నిధుల దారి మళ్లింపు వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. నిధులు ఎలా మళ్లిస్తారంటూ సర్వోన్నత ధర్మాసనం జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై సమాధానం చెప్పాలంటూ ఏపీ సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది.

ఎస్డీఆర్ఎఫ్ అంటే స్టేట్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌ నిధులను పీడీ ఖాతాలకు జగన్ ప్రభుత్వం మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా నిధులను దారి మళ్లించడంపై కేంద్ర ఆర్థిక శాఖ తీవ్ర అభ్యంతరం తెలిపింది.

దీంతో ఎస్టీఆర్‌ఎఫ్‌ నిధులు దారి మళ్లింపును నిలుపుదల చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. గతంలోనూ ఇదే కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

విద్యాశాఖపై సీఎం సమీక్ష

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -