Tuesday, April 16, 2024
- Advertisement -

ఎమర్జెన్సీకి ఒకే నంబర్​.. అతి త్వరలో అమల్లోకి

- Advertisement -

ప్రజలకు ఏ అత్యవసరం వచ్చినా ఒకే నంబర్​కు కాల్​ చేసే వెసులుబాటు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితమే నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోలీస్​ శాఖకు కాల్​చేయాలంటే 100, అగ్నిమాపక సిబ్బందికి 101, అంబులెన్స్​కు 108కి కాల్​చేస్తున్నాం. అయితే ఏ అత్యవసరం వచ్చినా 112 అనే నంబర్​కు ఫోన్​ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. దీనిపై ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి.

తెలంగాణ పోలీస్​శాఖ సైతం దీనిపై దృష్టి సారించింది. అతి త్వరలో ఈ నంబర్​ను పూర్తిస్తాయిలో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ విధానం దాదాపు అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలోనూ ఈ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని శాఖలను ఈ నంబర్​కు అనుసంధానించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి.

ఇందుకు సంబంధించి అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. వందల మంది ఒకేసారి ఫోన్​చేసినా.. వారి కాల్స్​ స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 112 నంబర్​పై ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సోషల్ మీడియా, మీడియా ద్వారా ప్రచారం కల్పిస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఈ విధానం అమల్లో ఉంది. ఏ ఆపద వచ్చినా ఒకే నంబర్​కు ఫోన్​ చేసే అవకాశం అక్కడ ఉంది. దీంతో మనదేశంలో కూడా అన్ని ఎమర్జెన్సీలకు ఒకే నంబర్​ను అందుబాటులోకి ఉంచాలని ప్రభుత్వం భావిస్తున్నది.

Also Read

చిరు చేసిన తప్పే బన్నీ చేస్తున్నాడా..!

దేశంలో మళ్ళీ పెరుగు తున్న క‌రోనా కేసులు!

బిగ్​బాస్​ 5 డేట్​ ఫిక్స్​.. కంటెస్టెంట్లు ఎవరంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -