Monday, May 13, 2024
- Advertisement -

పాపం సోము వీర్రాజు .. అన్నిటికీ అడ్డం పడుతున్న టీడీపీ

- Advertisement -
Somu Veerraju Hopes on Andhra BJP PResident

ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి పొందడం కోసం ఎప్పటి నుంచో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీరరాజు కాచుకుని కూర్చున్నారు. ఆ కోరిక ఆయన కి అందని ద్రాక్ష లాగా ఊరిస్తోంది. దేశం లోని అన్ని రాష్ట్రాలకీ బీజేపీ అధ్యక్షులని నియమిస్తోంది కానీ ఏపీ వైపు మాత్రం చూడడం లేదు.

అడిగిన ప్రతీ నెమ్మదిగా ఈ విషయం పెండింగ్ లో పెట్టేస్తోంది ఆ పార్టీ. ఆయన కోరుకున్న ప్రతీ సారీ నియామకం ఆగిపోతోంది. ఈ సారి కూడా ఇతర రెండు రాష్ట్రాలకి కొత్త అద్యక్షులని నియమించిన బీజేపీ ఏపీ వైపు చూడలేదు. దీంతో వీర్రాజు కి ఒళ్ళు మండుతోంది అంటున్నారు బీజేపీ జనాలు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కొత్తగా రెండు రాష్ట్రాలకు అధ్యక్షుల పేర్లను ప్రకటించింది. బీహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా నిత్యానందరాయ్ – ఢిల్లీ అధ్యక్షుడిగా మనోజ్ తివారీని ఎంపిక చేసింది. వీటితో పాటు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని కూడా ఫిల్ చేస్తారని అనుకున్నా దానిపై ఏమీ ప్రకటన రాలేదు. 

నిజానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా ఎంపీ కంభంపాటి హరిబాబు పదవీకాలం ఎప్పుడో పూర్తయింది. ఆయన్ను మళ్లీ కొనసాగించాలని వెంకయ్యనాయుడు – మిత్ర పక్షం టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు ఏపీలో కాపుల ఓట్లు కీలకం కానున్న తరుణంలో సోము వీర్రాజుకు ఛాన్సివ్వాలన్న వాదనా ఉంది. అదే అర్హతగా వీర్రాజు పై స్థాయిలో లాబీయింగ్ చేసి పదవి అంచుల వరకు వెళ్లారు. కానీ.. చంద్రబాబుపై నిత్యం విరుచుకుపడే వీర్రాజును ఆ పదవిలో చూడడం టీడీపీకి ఇష్టం లేదు. సో ఆయన ద్వారా వీర్రాజు ఆ పదవి అందుకోకుండా టీడీపీ ప్రయత్నం చేస్తోంది అని తెలుస్తోంది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -