Thursday, March 28, 2024
- Advertisement -

జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్.. ఆనందంలో అమరావతి..!

- Advertisement -

హైకోర్టు మూడు రాజధానుల బిల్లులపై స్టేటస్ కో ఇవ్వడంతో.. జగన్ సర్కార్ సుప్రీం కోర్టుకు వెళ్లింది. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ ఆర్ 5 జోన్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇళ్ల స్థలాల పంపిణీ ఆర్ 5 జోన్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్ధించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి.. దీనిపై హైకోర్టులోనే తేల్చుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తెలిపింది.

హైకోర్టులో కేసు తుది విచారణ ముగించాలని సుప్రీంకోర్టు తెలిపింది. దీనితో అమరావతి రైతులు ఆనందంలో మునిగిపోయారు. అమరావతిలో ఆర్ 5 జోన్ ను ప్రకటిస్తూ ప్రభుత్వం గతంలో గెజిట్ నోటిఫికేషన్ 355ను విడుదల చేసింది. ఆర్ 5 జోన్ కింద రాజధానిలోని 29 గ్రామాల ప్రజలకే కాకుండా గుంటూరు విజయవాడతో పాటు మంగళగిరి పెదకాకాని తాడేపల్లి దుగ్గిరాల మండలాల వారికి కూడా ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు 1300 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ ఉత్తర్వులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులని సస్పెండ్ చేయడంతో.. జగన్ సర్కార్ సుప్రీం కోర్టుకు వెళ్లింది. అయితే ఇక్కడ కూడా ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. సుప్రీం కూడా హైకోర్టుని సమర్థిస్తూ .. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి.. ఈ విషయాన్ని హైకోర్టు లోనే తేల్చుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తెలిపింది.

చంద్రబాబు కాల్ చేస్తే.. బ్లాక్ చేసిన టీడీపీ లీడర్లు..!

అన్ని రెడ్లకేనా.. ప్రజలు ఊరుకోరు : ఎంపీ రఘురామ

శంకుస్థాపన వాయిదా.. వెనుకడుగు వేసిన జగన్.. ఎందుకు ?

వైఎస్సార్‌ చేయూత.. మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -