Saturday, April 27, 2024
- Advertisement -

చింతపండు ప్రయోజనాలు..అస్సలు వదలరు!

- Advertisement -

చింతపండు ఈ పేరు వినగానే నోట్లో నీళ్లు రావడం కామన్. రుచిలో పులుపుతో ప్రతి ఒక్కరూ ఇష్టపడేది చింతపండే. ప్రతీ ఇంట్లో చింతపండు పులుసు ఉండాల్సిందే. అంతలా మన జీవితాలతో పెనవేసుకుపోయింది చింతపండు. అయితే ఇందులో ఉండే పోషక విలువలు తెలిస్తే వావ్ అనకమానరు.

చింతపండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి మెండుగా ఉంటుంది. ఫలితంగా రోగ నిరోధక శక్తిని పెంచడంలో దోహదపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి.ఇందులో ఉండే మెగ్నీషియం నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. శీతాకాలంలో వచ్చే వైరల్ ఫ్లూ లను ఎదుర్కొనేందుకు శక్తినిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

విటమిన్ ఇ, బి కాంప్లెక్స్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. మలబద్దకంతో బాధపడే వారు తప్పనిసరిగా తినే ఆహారంలో చింతపండు చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్, ఫాలిఫెనొలిక్ సమ్మేళనాలు జీర్ణ వ్యవస్థను ఎంతో మెరుగుపరిచి అల్సర్, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -