Wednesday, May 1, 2024
- Advertisement -

వేసవి ఉపశమనం కోసం..5 చిట్కాలు

- Advertisement -

ఎండలు దంచి కొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో మధ్నాహ్నం ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. ఇక ప్రధానంగా శరీరాన్ని డీ హైడ్రేట్ బారిన పడకుండా కాపాడుకుంటే ఎండదెబ్బ నుండి బయటపడవచ్చు. ఇందుకోసం శరీరాన్ని చల్చబర్చే ఆహార పదార్థాలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అలోవేరా..శరీరాన్ని కూల్‌గా ఉంచడంలో సాయపడుతుంది. జ్యూస్‌గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చర్మ సంబంధిత వ్యాధులు, చికాకు నుండి ఉపశమనం కలిగించేలా చేస్తుంది. సిట్రస్ పండ్లు..ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి శరీరాన్ని అంటు వ్యాధుల నుండి కాపాడుతుంది. శరీరంలోని వేడిని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.

పుదీనా…అజీర్ణం మరియు వేడి నుండి శరీరాన్ని కాపాడుతుంది. రుచిగా ఉండటంతో ఎక్కువ మంది పుదీనాను తీసుకోవడానికి ఇష్టపడతారు. అలాగే కోతిమీరను ఎక్కువగా ఉపయోగించడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా పనిచేయడానికి సహాయడుతుంది. అలాగే కొబ్బరి బొండం. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉండి చెమట ద్వారా కొల్పోయిన ద్రవాలు, ఖనిజాలను తిరిగి పొందడానికి సహాయం చేస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -