- Advertisement -

ప‌వ‌న్‌పై వ్యంగ్యాస్త్రాలు సందించిన రేవంత్‌రెడ్డి …

- Advertisement -

కాంగ్రెస్‌, జ‌న‌సేన మ‌ధ్య మాట‌ల యుద్ధం పెరుగుతోంది. తెలంగాణాలో ప‌వ‌న్ మూడు రోజుల రాజ‌కీయ యాత్రపై కాంగ్రెస్ సీనియ‌ర్‌నేత హ‌నుమంత్‌రావు ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు చేశారు. వీహెచ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ కూడా స్పందించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం అభ్యర్థిగా సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్)ను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటిస్తే ఆ పార్టీకి తాను మద్దతు ఇస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడం తెలిసిందే.

వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. వీహెచ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ కు పవన్ చెబితే బాగుంటుందని, కావాలంటే, పవన్ ని రాహుల్ వద్దకు తాను తీసుకెళ్తానంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ చేపట్టిన యాత్రలో తన స్థాయికి తగ్గట్టుగా ఆయన మాట్లాడలేదని, సీఎం కేసీఆర్ ను పొగడటం దురదృషకరమని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే పవన్ ని కేసీఆర్ రంగంలోకి దింపారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -