Wednesday, April 17, 2024
- Advertisement -

తెలంగాణా ప్ర‌భుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్ట్‌..

- Advertisement -

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 67 శాతం ఇవ్వాలన్న తెలంగాణ సర్కారు విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రిజ‌ర్వేష‌న్ల శాతం 50 శాతానికి మించ‌రాద‌ని మ‌రో సారి స్ప‌ష్టం చేసింది.

రాష్ట్రంలో బీసీల జనాభా అధికంగా ఉందని, ఈ ప్రత్యేక పరిస్థితుల కారణంగా ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్లను పెంచాల్సి ఉందని తెలంగాణా ప్ర‌భుత్వ న్యాయ‌వాది కోర్టుకు దెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 67 శాతం ఇవ్వాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం… రిజర్వేషన్లను పెంచడం కుదరదని, రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని తీర్పును వెలువరించింది.

కాగా, ఎస్టీ, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ల అమలు కోసం పోరాటం చేస్తామని టీఆర్‌ఎస్‌ తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీయిచ్చింది. ఈ అంశంపై తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తు చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -