Thursday, May 9, 2024
- Advertisement -

పెద్ద నోట్లు గుడిలో వేసేస్తున్నారు ..

- Advertisement -
temple hundies full with rs 500 and 1000 notes

ఎప్పుడో దేవుడికి మొక్కిన మొక్కులు చెల్లించుకోవడం! వెరసి.. ఇప్పుడు దేవుళ్ల హుండీలన్నీ రూ.500, రూ.1000 నోట్లతో నిండిపోతున్నాయి. యాదగిరిగుట్ట, భద్రాచలం, వేములవాడ, కొండగట్టు ఆంజనేయస్వామి, బాసర సరస్వతీ క్షేత్రం, కొమురవెల్లి మల్లన్న, వరంగల్ భద్రకాళి, సికింద్రాబాద్ గణపతి దేవాలయాల వద్ద భక్తులు హుండీల దగ్గర క్యూలలో నిలిచి పెద్ద నోట్లతో హుండీలు నింపుతున్నారు.

దేవాలయాలన్నింటిలో నెలాఖరులోనే హుండీల లెక్కింపు జరుగుతుందని, అందుకని రూ.500లు, రూ.1000 నోట్లకట్టలు ఎన్ని పడ్డాయో ఇప్పుడే చెప్పడం కష్టమని ఆలయాల పరిపాలనాధికారులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా పెద్ద సంఖ్యలో జనం నోట్ల కట్టలు కుప్పలుగా వేస్తుండటాన్ని చాటునుండి గమనిస్తున్న ఆలయాల ఉద్యోగులు దేవుడి ఆదాయం పెరుగుతున్నందుకు సంతోషం పట్టలేకపోతున్నారు. యాదాద్రిలో బుధవారం ఆర్జిత సేవల ఆదాయం లక్షవరకు పెరిగినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -