Thursday, May 9, 2024
- Advertisement -

ఆలయాల పై కేసిఆర్ కామెంట్..గడువులోగా తుది మెరుగులు..!

- Advertisement -

యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రం త్వరలో పున: ప్రారంభం అవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. గడువులోగా తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం 350 ఫీట్ల పొడవైన క్యూలైన్ నిర్మాణాన్ని ఇత్తడి డిజైన్లతో తీర్చిదిద్దాలని సూచించారు. ఉత్తర దిక్కున ఉన్న ప్రహరీ గోడను తొలగించి, అక్కడ క్యూలైన్ నిర్మాణం చేపట్టాలన్నారు.

ఏప్రిల్ 15 కల్లా ఈ నిర్మాణం పూర్తికావాలని స్పష్టం చేశారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్​లో సమీక్ష జరిపారు. పునర్నిర్మాణ పనులు తుది రూపుదాలుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దివ్యమైన అలంకృత రూపం కోసం కార్యచరణపై చర్చించారు.

బ్రహ్మోత్సవాల్లో సుదర్శనం చక్రం ఏర్పాటు చేసినట్టుగానే, శివాలయం చుట్టూ త్రిశూలం దర్శనం ఇవ్వాలని కేసీఆర్ పేర్కొన్నారు. రథశాలను టెంపుల్ ఎలివేషన్​తో తీర్చిదిద్దాలని సూచించారు. విష్ణు పుష్కరిణి కొండపై చుట్టూ నిర్మించే ప్రహరీ గోడల మీద రెండు వైపులా వెలుగులు విరజిమ్మేలా విద్యుత్ దీపాలు అలంకరించాలని చెప్పారు. 80 ఫీట్ల పొడవున్న దీప స్తంభాన్ని లాన్ నడుమ ఏర్పాటు చేయాలని తెలిపారు.

చివరి అంకం చేరుకున్న ఆలయ నిర్మాణం పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పునర్నిర్మాణానంతరం ప్రపంచ దేవాలయాల్లోనే యాదాద్రి పుణ్యక్షేత్రం తన ప్రత్యేకతను చాటుకోబోతోందని స్పష్టం చేశారు.

నూటికి నూరు శాతం రాతి కట్టడాలతో కృష్ణ శిలలతో నిర్మితమవుతున్న యాదాద్రి దేవాలయం అద్భుత రూపాన్ని సంతరించుకుంటున్నదని పేర్కొన్నారు. పున: ప్రారంభానంతరం లక్ష్మీనారసింహుని దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా గుట్ట పరిసర ప్రాంతాలను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

జగన్ గురుంచి పింగళి మనవరాలి కామెంట్స్ హల్ చల్..!

రాజ్ తరుణ్ బ్యాడ్ టైమ్… వరుస ఫ్లాపులు!

కొంచెం తిన్నా.. కడుపులో సమస్యలొస్తున్నాయా?

చిరంజీవి చేతుల మీదుగా ‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ రిలీజ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -