Monday, May 20, 2024
- Advertisement -

కేటీఆర్ బ్లాక్ బస్టర్ , లోకేష్ అట్టర్ ప్లాప్

- Advertisement -

ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జీ హెచ్ ఎం సి ఎన్నికల పర్వం ముగిసింది. బల్దియా పరీక్ష కి పోటా పోటీగా ప్రిపేర్ అయ్యారు ముఖ్య మంత్రుల కొడుకులు, ఒక పక్క తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కొడుకు కేటీఆర్ గ్రేటర్ ఎన్నికలు గెలవడం లక్ష్యంగా రంగంలోకి దిగితే. తర్వాత నారా లోకేష్ – సన్ ఆఫ్ ఏపీ సీఎం అంటూ చిన్న బాబు ఒచ్చాడు.

ఈ ఎన్నికలు ఒకరకంగా ఇద్దరి మధ్యనా ఎవరు ఎంత గొప్ప , ఎవరు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు చేతిలోకి తీసుకున్నారు అన్న నేపధ్యంలో సాగాయి.తండ్రి నుంచి గ్రేటర్ బాధ్యతలను అందుకుని పార్టీని ఒంటిచేత్తో నడిపించారు కేసీఆర్ తనయుడు కేటీఆర్.. అయితే లోకేష్ మాత్రం ఈ విషయంలో ఘోరంగా ఫెయిలయ్యారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికల ప్రచారం వరకు పేలవ ప్రదర్శన ఇచ్చిన లోకేష్ బాబు.. గ్రేటర్ వాసుల పరీక్షలో హట్టర్ ప్లాప్ అయ్యారు.

2009 లో గ్రేటర్ అంటే వెనక అడుగు వేసిన పార్టీ ఇప్పుడు నెంబర్ 1 గా మారింది అంటే దానికి కేటీఆర్ చాలా కష్టపడ్డారు అని చెబుతున్నాయి తెరాస వర్గాలు. ఈ విషయం లో కేటీఆర్ కి పూర్తి అవగాహన ఉంది అని అందుకే జాగ్రత్తగా అడుగులు వేసారు అనీ అభ్యర్ధులని సెలెక్ట్ చేసే విషయం దగ్గర నుంచీ ఓట్లు వెయ్యమని జనాలని ప్రోత్సహించడం వరకూ చాలా పెద్ద ప్రణాళిక తో వెళ్లారు అని చెబుతున్నారు.  ఇక కేటీఆర్ నిర్వహించినన్ని రోడ్ షోలు గ్రేటర్ లో ఇంకేపార్టీ నిర్వహించలేదన్నది వాస్తవం.

ప్రచారంలో సూటి ప్రసంగాలు… అందరినీ నమ్మించిన నాయకత్వ ప్రతిభ కలిగిన నేత కాబట్టే సెటిలర్లు కూడా టీఆర్ఎస్ వైపు వచ్చారు. మొన్న జరిగిన సర్వే లోనే లోకేష్ జనాలని ప్రభావితం చెయ్యడం లో 2 % మాత్రమే సక్సెస్ అయ్యారు అనీ కానీ కేటీఆర్ అందరికంటే ఎక్కువగా 29 % సక్సెస్ అయ్యారు అని తెలిసింది. టీడీపీ కి హెడ్ గా , ఫ్యూచర్ నాయకుడిగా ఉంటాడు అనుకున్న నారా లోకేష్ పార్టీ కి పెద్ద తలనొప్పిగా మారాడు ఇప్పుడు.  ఎంతగా అంటే  చివరకు సొంత కమ్మ సామాజికవర్గానికి కూడా లోకేష్ భరోసా ఇవ్వలేకపోయారు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -