Thursday, March 28, 2024
- Advertisement -

వావ్.. ఇకపై వాట్సప్ లో ఆ ప్రాబ్లం కు చెక్ !

- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ మెసేజింగ్ యాప్ గా వాట్సప్ టాప్ ప్లేస్ లో ఉంది. ప్లే స్టోర్ లో ఇప్పటివరకు దాదాపుగా 2 బిలియన్ యూజర్స్ ను కలిగి ఉంది. ఇక వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో తమ యూజర్స్ కు మరింత చేరువ అవుతూ ఉంటుంది. ఇప్పటికే యూజర్స్ కోరిక మేరకు స్టేటస్ లిమిట్, ఫైల్ స్టోరేజ్ లిమిట్, గ్రూప్ చాట్ లో కొన్ని ఫీచర్స్, అలాగే మెసేజింగ్ స్పాట్ ఎమోజీస్ వంటి ఎన్నో ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక తాజాగా యూజర్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ” డిలీట్ ఫర్ ఎవ్రీ ఒన్ ” ఫీచర్ లో సరికొత్త మార్పులు చేసింది.

మనం మెసేజ్ పంపిన వ్యక్తికి తప్పుగా మెసేజ్ పంపినప్పుడు ఆ మెసేజ్ ను “డిలీట్ ఫర్ ఎవ్రీ ఒన్ ” ఆప్షన్ ద్వారా డిలీట్ చేసే అవకాశం ఉంది. అయితే ” డిలీట్ ఫర్ ఎవ్రీ ఒన్ ” ఆప్షన్ గతంలో కేవలం ఒక గంట 8 నిముషాలు మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ లోగా అవతలి వ్యక్తికి తప్పుగా పంపిన మెసేజ్ ను డిలీట్ చేయాల్సి ఉండేది. గంట తరువాత కేవలం మన వాట్సప్ లోనే ఆ డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవతలి వ్యక్తి దాంట్లో డిలీట్ చేసే అవకాశం ఉండదు. దాంతో చాలా మంది ఈ ప్రాబ్లంపై సోల్యూషన్ కొరకు వాట్సప్ ను ఎంతో కాలంగా కోరుతూ వస్తున్నారు.

ఇక తాజాగా ” డిలీట్ ఫర్ ఎవ్రీ ఒన్ ” టైమ్ లిమిట్ ను మరింత పెంచుతూ వాట్సప్ ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకు రానుంది. ఇప్పటివరకు ” డిలీట్ ఫర్ ఎవ్రీ ఒన్ ” టైమ్ లిమిట్ ఒక గంట 8 నిముషాలు మాత్రమే ఉండగా.. ఇకపై ” డిలీట్ ఫర్ ఎవ్రీ ఒన్ ” ఆప్షన్ 2 రోజుల 16 గంటలకు వాట్సప్ పెంచింది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇప్పటికే కొంతమందికి ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా.. మరికొద్ది రోజుల్లో అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

Also Read

మొబైల్ చార్జింగ్ వెంటనే అయిపోతుందా.. అయితే ఇలా చేయండి !

ప్లాస్టిక్ కు చెక్.. సరికొత్త రోబో టెక్నాలజీ.

మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ పెంచే అద్బుతమైన టిప్స్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -