Friday, May 10, 2024
- Advertisement -

రాహుల్ చేస్తే రైటు.. జగన్ చేస్తే తప్పా..?!

- Advertisement -

కాంగ్రెస్ యువరాజు ఓదార్పుయాత్రకు సిద్ధం అయిపోతున్నాడు. ఆయన ఈ విడతలో ఆంధ్రప్రదేశ్ లో పరామర్శ యాత్ర చేపడుతున్నాడు. అనంతపురం జిల్లా లో రైతులను పరామర్శించనున్నాడు.

ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలను పరామర్శించి వాళ్లకు ఆర్థిక సాయం చేయడానికి రాహుల్ ఈ పర్యటనను చేపట్టాడు. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాకా.. కొంత కాలం కిందట యాక్టివ్ అయిన రాహుల్ ఇలా దేశ వ్యాప్తంగా పరామర్శ యాత్రలు చేపడుతున్నాడు. 

మరి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. గతంలో రాహుల్ ఇలాంటి పరామర్శ యాత్రలను తప్పుపట్టారు. రాహుల్ వ్యక్తిగతంగా కాదు కానీ.. ఆయన తల్లి సోనియాగాంధీ స్థాయిలో ఈ పరామర్శయాత్రలను తప్పుపట్టడం జరిగింది. అది కూడా జగన్ విషయంలో. జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో ఓదార్పుయాత్రను చేపడతాను అంటే కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ దాన్ని తప్పుపట్టింది. జగన్ జనాల్లోకి వెళ్లడానికి వీలు లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

కావాలంటే వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి  కుటుంబాలన్నింటినీ ఒక చోటికి పిలిపించి ఓదార్చాలని.. వారికి ఆర్థిక సాయం కూడా అక్కడే చేయాలని అప్పట్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఒక సూచన కూడా చేశారప్పట్లో.. అయితే దానికి జగన్ మోహన్ రెడ్డి సమ్మతించలేదు. ఓదార్పు యాత్ర దగ్గర వచ్చిన తేడాలతోనే జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు. మరి అప్పట్లో ఓదార్పు యాత్ర అంటే… అందరినీ ఒక చోటికి పిలపించుకని ఓదార్చడం అని అప్పట్లో కాంగ్రెస్ వాళ్లు చెప్పారు. అయితే ఇప్పుడు మాత్రం రాహుల్ బాబు రోడ్ల మీదకు వచ్చి జనాలను ఓదారుస్తున్నాడు! అప్పట్లో జగన్ చేసింది తప్పు అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడిలా చేయవచ్చా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -