Friday, March 29, 2024
- Advertisement -

నెల్లూరు జిల్లాలో వారిదే గెలుపు.. ఎగురుతున్న జండా..!

- Advertisement -

నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘానికి 2 వార్డుల్లో జరిగిన ఎన్నికల్లో వైసిపి విజయం సాధించింది. మొత్తంగా 25 వార్డులు ఉన్న నాయుడుపేట పురపాలక సంఘంలో.. ఇప్పటికే 23 ఏకగ్రీవంఅయ్యాయి. వైసిపి 21, టిడిపి 1, బిజేపి 1 స్థానం సొంతం చేసుకున్నాయి. ఓట్ల లెక్కింపు అనంతరం.. వైసిపి మొత్తంగా 23 స్థానాలు సొంతం చేసుకుని.. పురపాలక సంఘాన్ని సొంతం చేసుకుంది.

పుర ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 10-10.30 గంటల మధ్య తొలి ఫలితం వెలువడనుంది. సాయంత్రం 6 గంటల్లోగా మహా నగర విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) మినహా అన్నిచోట్లా ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. విశాఖలో డివిజన్ల సంఖ్య ఎక్కువ కావడంతో ఆలస్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు.

హైకోర్టు ఆదేశాలతో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఓట్ల లెక్కింపును తాత్కాలికంగా నిలిపివేశారు. 11 నగరపాలక సంస్థల్లో 533 డివిజన్‌ సభ్యుల స్థానాలకు పోలైన 27,29,072 ఓట్లను లెక్కిస్తున్నారు. 71 పురపాలక, నగర పంచాయతీల్లో 1,633 వార్డు సభ్యుల స్థానాలకు పోలైన 21,03,284 ఓట్ల లెక్కింపు చేపట్టారు.

సమస్యలు పరిష్కరించే అభ్యర్థికే నా ఓటు : మంత్రి కేటీఆర్

బాంబ్ బ్లాస్ట్ కన్నా ఎక్కువ తుమ్మితే భయపడుతున్నారు : సద్గురు జగ్గీ వాసుదేవ్

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి!

మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -