Sunday, April 28, 2024
- Advertisement -

సమస్యలు పరిష్కరించే అభ్యర్థికే నా ఓటు : మంత్రి కేటీఆర్

- Advertisement -

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు రాజకీయ ప్రముఖులు ఓటు వేశారు.

హైదరాబాద్​లోని షేక్​పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టభద్రులంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. సమస్యలను పరిష్కరించే అభ్యర్థికే తన ఓటు వేశానని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఇక ఇంట్లో బ‌య‌లుదేరే ముందు గ్యాస్ సిలిండ‌ర్‌కు న‌మ‌స్కారం పెట్టి వ‌చ్చి ఓటేశానని కేటీఆర్ ఈ సంద‌ర్భంగా చెప్పారు. గ్యాస్ సిలిండ‌ర్‌, పెట్రోలు ధ‌ర‌లు పెరిగిపోతున్నాయ‌ని ఆయ‌న ప‌రోక్షంగా చెప్పారు.   విద్యావంతులంతా సమర్థులకే ఓటు వేయాలని కోరారు.

మహబూబ్​నగర్​లో రాష్ట్ర పర్యటక, ఆబ్కారీ శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు పోలింగ్​లో పాల్గొనాలని కోరారు. విద్యావంతులు ఓటింగ్​కు దూరంగా ఉంటారనే అపోహను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మలక్​పేటలోని పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి!

మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న జాతిరత్నాలు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -