Sunday, April 28, 2024
- Advertisement -

మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఏలూరు నగర పాలక సంస్థ మినహా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించిన నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఆదివారం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు.  హైకోర్టు ఆదేశాల మేరకు ఏలూరులో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రస్తుతం చేపట్టడం లేదు. ఓట్ల లెక్కింపు కోసం పురపాలక శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది.

ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుండగా ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 12 నగర పాలక సంస్థల్లోని 671 డివిజన్లలో 91 ఏకగ్రీవం కాగా 580 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ఏలూరులో 47 డివిజన్లలో తప్ప మిగిలిన 533 డివిజన్లలో ఓట్లను లెక్కించనున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ చేపట్టిన 12 నగర పాలక సంస్థల్లోని 671 డివిజన్లలో 91 ఏకగ్రీవమయ్యాయి. దాంతో 580 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు.

వాటిలో ఏలూరులో ఎన్నికలు నిర్వహించిన 47 డివిజన్లలో ఓట్ల లెక్కింపు ప్రస్తుతం చేపట్టడం లేదు. మిగిలిన 533 డివిజన్లలో పోలైన ఓట్లను ఆదివారం లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.  ఓట్ల లెక్కింపు సందర్బంగా విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుండగా, రెండు గంటల్లోనే తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది.

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న జాతిరత్నాలు !

అమితాబ్, చిరు కాంభినేషన్ లో మ‌రో మూవీ !

శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -