ప్రపంచంలో చైనాలోని పుహాన్ లో పుట్టుకు వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలా వదలడం లేదు. కరోనా పేరు చెబితేనే వెన్నుల్లో వణుకు పుడుతుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు ఎవ్వరినీ వదలడం లేదు కరోనా. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్ స్పందించారు. ప్రస్తుతం ప్రపంచమంతా బాంబ్ బ్లాస్ట్ కంటే తుమ్మితేనే ఎక్కువ భయపడుతోందని అన్నారు.
ఇప్పటి వరకు రకాల వ్యాధుల నుంచి తప్పించుకునేందుకు చిన్నప్పటి నుంచి ఎన్నో టీకాలు తీసుకున్నామని, ఇప్పుడు బతికి ఉన్నామంటే అదే కారణమని అన్నారు. ఆధునిక కాలంలో మెడిసిన్ అనేది లేకుంటే మనం ఫ్లూని కూడా ఓడించలేకపోయేవారమని పేర్కొన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనం చనిపోవడానికి కేన్సరే కారణం కానక్కర్లేదని, గట్టిగా తుమ్మినా చనిపోయే అవకాశాలు ఉన్నాయన్నారు.
కరోనా మనిషి జీవన విధానం పూర్తిగా మార్చివేసింది. ఇప్పుడు ప్రాణాలు కాపాడుకోవడం వైద్యుల చేతుల్లో ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ మన చేతుల్లోనే ఉంది. ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు కరోనా ని నియంత్రించేందుకు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం అని ఆయన అన్నారు.
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి!
