Friday, May 10, 2024
- Advertisement -

ఆపరేషన్ “కమ్మ” మొదలు పెట్టిన జగన్

- Advertisement -

2014 సమయం లో తెలుగు రాష్ట్రం ఆంద్ర ప్రదేశ్ లో “కాపు” సామాజిక వర్గం వారు అంతా జగన్ కే ఓటు బ్యాంకు గా ఉన్నట్టు చెబుతారు. అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన సమయం లోనే రాజశేకర రెడ్డి తన హవా తో ఆ ఓట్లు తన వైపు వేయించుకోవడం లో సక్సెస్ అయ్యారు.

తరవాత మొన్న జరిగిన ఎన్నికల లో తాను కూడా తన తండ్రి లాగా ఆ వోటు బ్యాంక్ మీద దృష్టి పెట్టారు జగన్. అంతా బాగానే ఉంది అనుకున్న క్రమం లో పవన్ కళ్యాణ్ మధ్యలో వచ్చి ఎన్నో లక్షల కాపు ఓట్లు గద్దలాగా తన్నుకుపోయి చంద్రబాబు కి ఫర్ గా వేయించారు. రానున్న 2019 ఎన్నికల సమయానికి కాపులతో పాటు “కమ్మ’ సామాజిక వర్గాన్ని కూడా జగన్ దువ్వె పన్ని లో పడ్డారు.

టీడీపీ కి ఈ సామాజిక వర్గం బాగా వెన్ను దన్ను గా ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే.అయితే కమ్మ ప్రాబ‌ల్యం అధికంగా ఉండే కృష్ణా, గుంటూరుతో పాటు ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో టీడీపీ దెబ్బ‌కు వైకాపా కుదేలైంది. ఈ నాలుగు జిల్లాల్లో వైకాపాకు కేవ‌లం 14 స్థానాలు మాత్ర‌మే వ‌చ్చాయి. ఆ దెబ్బ తో ఆ రెండు సామాజిక వర్గాలకి కూడా ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అనేది జగన్ కి బోధ పడింది.ఉత్తరాంధ్ర లో కాపు సామాజికవర్గం కి లీడర్ లాంటి బొత్సా ని తన పార్టీ లోకి లాక్కున్న జగన్ ఇప్పుడు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వై కా పా ని బలోపేతం చేసే పనిలో “ఆపరేషన్ కమ్మ” మొదలెట్టారు.

కృష్ణా జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రును పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఆయ‌న పార్టీలోకి వ‌స్తే ఆయ‌నకు జిల్లా వైకాపా అధ్య‌క్ష ప‌ద‌విని కూడా ఆఫ‌ర్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇప్పటికే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని జగన్ వెంటే ఉన్న విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -