Friday, May 3, 2024
- Advertisement -

మ‌రో సారి ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న వైఎస్ ష‌ర్మిల..?

- Advertisement -
YS Sharmila re entry into politics..?

ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. సార్వ‌త్రికి ఎన్నిక‌ల‌కు ఇంకా రెండు సంత్సారాల స‌మ‌యం ఉన్నా ఇప్ప‌టినుంచే రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి.

ఇక వైసీపీ కూడా ఎలాగైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారాన్ని చేప‌ట్టాల‌ని తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది.అంది వ‌చ్చే అన్ని అవ‌కాశాల‌ను వినియేగించుకోవాల‌ని చూస్తోంది వైసీపీ.

{loadmodule mod_custom,Side Ad 1}

అస‌లు విష‌యానికి వ‌స్తే వైఎస్ ష‌ర్మిల అంటె అంద‌ర‌కి గుర్తు కొచ్చేది ..ఉమ్మ‌డి ఆంధ్ర ప‌ర‌దేశ్‌లో ఏపీ సీఎంగా ప‌నిచేసిన వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కూతురు. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక ఉమ్మ‌డి రాష్ట్రంలో ప్రాణాలు విడిచిన అభిమానుల కుటుంబాల‌ను పరామ‌ర్శించేందుకు జ‌గ‌న్ ఓదార్పు యాత్ర మొద‌లు పెట్టారు. అయితే ఆక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్ జైలుకు వెల్ల‌డ‌తో ఆ బాద్య‌త‌ను జ‌గ‌న్ చెల్లెలు ష‌ర్మిల ఓదార్పు యాత్ర‌ను కొన‌సాగించారు.
గ‌త కొంత కాలంగా వైఎస్ ష‌ర్మిల ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.దీనిమీద విప‌క్ష‌పార్టీలు జ‌గ‌న్ త‌ల్లిని,చెల్లిని రాజ కీయాంగా వాడుకొని ప్ర‌స్తుతం ప‌క్క‌న పెట్టార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే దీనిమీద ష‌ర్మిల దీనిపై ఓ యూట్యూబ్ చాన‌ల్‌కు ఇంట‌ర్వూలో క్లారిటీ ఇచ్చారు .త‌న అన్న జ‌గ‌న్ న‌న్ను ప‌క్క‌న పెట్ట‌లేద‌ని మామ‌ధ్య బేధాభిప్రాయాలు లేవ‌ని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మ‌రోసారి ష‌ర్మిల ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

{loadmodule mod_custom,Side Ad 2}

త్వ‌ర‌లో విజ‌య‌వాడ వేదిక‌గా జ‌ర‌గ‌బోయే పార్టీ ప్లీన‌రీలో మ‌ల్లీ రాజ‌కీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న‌ట్లు స‌మాచారం.వైఎస్ మ‌ర‌ణాన్ని త‌ట్ట‌కోలేక ప్రాణాలు విడిచిని అభిమానుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించి మీకు అండ‌గా మేమున్నామంటూ భ‌రోసాను క‌ల్పించారు. ఇప్ప‌టికే జ‌గ‌న్ దూకుడును త‌ట్టుకోలేక ఆప సోపాలు ప‌డుతున్న‌బాబు ఆయ‌న టీంకు ఇక ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని వైసీపీ శ్రేణులు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

{youtube}MpNeAX9wcXI{/youtube}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -