Friday, May 10, 2024
- Advertisement -

ప్ర‌ధాన పార్టీల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న లేటెస్ట్ స‌ర్వే

- Advertisement -

ఏపీలో సీఎం సీటు కోసం వైసీపీ, జ‌న‌సేన‌, టీడీపీ లు పోటా పోటీగా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. విజ‌యం మాదంటె మాధేన‌నే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అయితే రాష్ట్ర‌ప్ర‌జ‌లు మాత్రం జ‌గ‌న్‌ను సీఎం చేడానికి ఫిక్స్ అయిన‌ట్లు అనేక స‌ర్వేల ద్వారా వెల్ల‌డ‌య్యింది. తాజ‌గా ఇప్పుడు మ‌రో స‌ర్వే త‌న ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది. ఈ ఫ‌లితాల్లో వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. మోత్తం 175 నియోజ‌క వ‌ర్గాల్లో వైసీపీ 85, టీడీపీ 34, జ‌న‌సేన 1 గెల‌వ‌గా 55 స్థానాల్లో మాత్రం ఫైట్ ట‌ఫ్‌గా ఉండ‌నుంద‌ని స‌ర్వే తెలిపింది.

జిల్లాల వారీగా స‌ర్వే వివ‌రాలు…

శ్రీకాకుళం..మొత్తం స్థానాలు 10

వైసీపీ …5
టీడీపీ….2
జ‌న‌సేన‌…0
ట‌ఫ్‌…3

శ్రీకాకుళం…ఈ జిల్లాలో మొత్తం 10 నియోజ‌క వ‌ర్గాలున్నాయి. ఈ ప‌దిస్థానాల్లో వైసీపీ 5, టీడీపీ 2 గెల‌వ‌నున్నాయి. జ‌న‌సేన మాత్రం ఒక్క సీటుకూడా గెలిచే ప‌రిస్థితులు లేవు.ఇక 3 స్థానాల్లో టీడీపీ, వైసీపీ మ‌ధ్య‌ఫైట్ ట‌ఫ్‌గా ఉండ‌నుంది. పాత‌ప‌ట్నం, ప‌లాసా, పాల‌కొండ నియోజ‌క వ‌ర్గాల్లో ఫైట్ ట‌ఫ్‌గా ఉండ‌నుంది.

విజ‌య‌న‌గ‌రం….మొత్తం నియోజ‌క వ‌ర్గాలు 9

వైసీపీ…2
టీడీపీ…2
జ‌న‌సేన‌…0
ట‌ఫ్‌…5

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని మొత్తం 9 నియోజక వ‌ర్గాల్లో వైసీపీ 2, టీడీపీ2 స్థానాలు గెలుచుకోనున్నాయి. 5 స్థానాల్లో మాత్రం ఫైట్ ట‌ఫ్‌గా ఉండ‌నుంది. కురుపాం, పార్వ‌తీ పురం, సాలూరు, నెలిమ‌ర్ల‌, విజ‌య‌న‌గ‌రం స్థానాల్లో గెలుపు నువ్వా నేనా అన్న‌ట్లుగా ఫైట్ కొన‌సాగ‌నుంది.

విశాఖ ప‌ట్నం…మొత్తం నియోజ‌క వ‌ర్గాలు..15

వైసీపీ…7
టీడీపీ…2
జ‌న‌సేన‌..1
ట‌ఫ్‌… 5

విశాఖ మొత్తం 15 నియోజ‌క వ‌ర్గాల్లో వైసీపీ 7, టీడీపీ2, జ‌న‌సేన 1 స్థానాలు గెలుకోనున్నారు. మ‌రో 5 స్థానాల్లో ఫైట్ ట‌ఫ్‌గా ఉండ‌నుంది.విశాఖ‌ప‌ట్నం ఈస్ట్‌, విశాఖ ప‌ట్నం సౌత్‌, విశాఖ‌ప‌ట్నం వెస్ట్‌, మాడుగుల‌, పాయ‌క‌రావుపేట నియోజ‌క వ‌ర్గాల్లో బ‌ల‌మైన పోటీ నెల‌కొంది.

తూర్పుగోదావ‌రి..మొత్తం నియోజ‌క వ‌ర్గాలు..19
వైసీపీ…7
టీడీపీ…5
జ‌న‌సేన‌..0
ట‌ఫ్‌… 7
తూర్పుగోదావ‌రి జిల్లాలోని మొత్తం 19 నియోజ‌క వ‌ర్గాల్లో వైసీపీ 7, టీడీపీ 5 స్థానాలు గెలుచుకోనున్నాయి. 7 స్థానాల్లో పోటీ ట‌ఫ్‌గా ఉండ‌నుంది.ప్ర‌త్తిపాడు, పిఠాపురం, కాకినాడ సిటీ, రాజోలు, కొత్త‌పేట‌, రాజాన‌గ‌రం, రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క వ‌ర్గాల్లో ఫైట్ ట‌ఫ్‌గా ఉండ‌నుంది.

ప‌శ్చిమ గోదావ‌రి…మొత్తం నియోజ‌క వ‌ర్గాలు 15

వైసీపీ…6
టీడీపీ…5
జ‌న‌సేన‌..0
ట‌ఫ్‌..4

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో మొత్తం 15 నియోజ‌క వ‌ర్గాల‌కు గాను వైసీపీ 6, టీడీపీ 5 స్థానాలు గెలుచుకోనున్నాయి. 4 నియోజ‌క వ‌ర్గాల్లో ట‌ఫ్ ఫైట్ కొన‌సాగునుంది. న‌ర్సాపురం, భీమ‌వ‌రం, దెందులూరు, పోల‌వ‌రం స్థానాల్లో గ‌ట్టి పోటీ ఉండ‌నుంది.

కృష్ణా జిల్లా… మొత్తం నియోజ‌క వ‌ర్గాలు 16
వైసీపీ…5
టీడీపీ..5
ట‌ఫ్‌.. 6

కృష్ణాజిల్లాలో మొత్తం 16 నియోజ‌క వ‌ర్గాల‌కు గాను వైసీపీ 5, టీడీపీ 5 స్థానాలు గెలుచుకోనున్నాయి. స‌ర్వేలో జ‌న‌సేన మాత్రం ఖాతా తెర‌వ‌నేలేదు. 6 నియోజ‌క వ‌ర్గాల్లో గ‌ట్టి పోటీ నెల‌కొంది. పెడ‌న‌, అవ‌నిగ‌డ్డ‌, విజ‌య‌వాడ వెస్ట్‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, నందిగామ‌, జ‌గ్గ‌య్య‌పేట స్థానాల్లో గ‌ట్టి పోటీ ఉండ‌నుంది.

గుంటూరు..మొత్తం స్థానాలు 17
వైసీపీ..6
టీడీపీ…4
జ‌న‌సేన‌..0
ట‌ఫ్‌…7

గుంటూరు మొత్తం 17 నియోజక వ‌ర్గాల్లో వైసీపీ 6, టీడీపీ 4 స్థానాలు గెలుచుకోగా జ‌న‌సేన ఖాతాతెర‌వ‌నేలేదు. మ‌రో 7 స్థానాల్లో గ‌ట్టి పోటీ నెల‌కొంది. గ‌ట్టి పోటీ ఉన్న నియోజ‌క వ‌ర్గాల్లో మంగ‌ళ‌గిరి, తెనాలి, ప్ర‌త్తిపాడు, గుంటూరు వెస్ట్‌, గుంటూరు ఈస్ట్‌, చిల‌క‌లూరిపేట‌, స‌త్తెన‌ప‌ల్లి స్థానాల్లో గ‌ట్టిపోటీ నెల‌కొంది.

ప్ర‌కాశం…మొత్తం స్థానాలు..12
వైసీపీ…6
టీడీపీ…3
జ‌న‌సేన‌…0
ట‌ఫ్‌…3

ప్ర‌కాశం జిల్లాలో ఉన్న 12 స్థానాల్లో వైసీపీ 6, టీడీపీ 3 స్థానాల్లో విజ‌యం సాధించ‌నున్నాయి. 3 స్థానాల్లో గ‌ట్టి పోటీ నెల‌కొంది. ప‌ర్చూరు, ఒంగోల్‌, క‌నిగిరి స్థానాల్లో మూడు ప‌ర్టీల మ‌ధ్య గ‌ట్టి పోటీ ఉండ‌నుంది.

నెల్లూరు…మొత్తం స్థానాలు..10
వైసీపీ…9
టీడీపీ…0
జ‌న‌సే…0
ట‌ఫ్ …1 స్థానం

నెల్లూరులో ఉన్న మొత్తం ప‌ది స్థానాల్లో వైసీపీ 9, టీడీపీ 0, జ‌న‌సేన 0. ఒక సీట్‌లో గ‌ట్టి పోటీ నెల‌కొంది. నెల్లూరు సిటీస్థానంలో గ‌ట్టిపోటీ నెల‌కొంది. వైసీపీ అభ్య‌ర్ధి అవిల్ కుమార్‌, మంత్రి నారాయ‌ణ టీడీపీ త‌రుపున పోటీ చేస్తున్నారు.

క‌డ‌ప‌…మొత్తం స్థానాలు..10
వైసీపీ…10
టీడీపీ…0
జ‌న‌సేన‌…0

క‌డ‌ప మొత్తం ప‌దికి ప‌ది స్థానాల్లో వైసీపీ క్లీన్ స్విప్ చేయ‌నుంది.

క‌ర్నూలు…మొత్తం స్థానాలు..14
వైసీపీ…9
టీడీపీ…2
జ‌నేన‌…0
ట‌ఫ్‌…3

క‌ర్నూల్లో ఉన్న మొత్తం 14 స్థానాల‌కు గాను వైసీపీ 9, టీడీపీ 2 స్థానాలు గెలుచుకోనున్నాయి. 3 నియోజ‌క వ‌ర్గాల్లో గ‌ట్టి పోటీ ఉండ‌నుంది. నంద్యాల‌, ఆలూరు, ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క వ‌ర్గాల్లో వైసీపీ, టీడీపీ మ‌ధ్య గ‌ట్టి పోటీ ఉండ‌నుంది.

అనంత‌పురం..మొత్తం స్థానాలు 14
వైసీపీ…6
టీడీపీ…3
జ‌న‌సేన‌.. 0
ట‌ఫ్‌..5

అనంత‌పురంలోని మొత్తం 14 నియోజ‌క వ‌ర్గాల్లో వైసీపీ 6, టీడీపీ 3 స్థానాలు గెలుచుకోనున్నాయి. 5 నియోజ‌క వ‌ర్గాల్లో గ‌ట్టి పోటీ ఉండ‌నుంది. గుంత‌క‌ల్‌, పార్తాడు, మ‌డ‌క‌శిర‌, హందూపూర్‌, ధ‌ర్మ‌వ‌రం స్థానాల్లో వైసీపీ, జ‌న‌సేన‌, టీడీపీ మ‌ధ్య గ‌ట్టి పోటీ ఉండ‌నుంది.

చిత్తూరు.. మొత్తం స్థానాలు..14
వైసీపీ…8
టీడీపీ… 1
జ‌న‌సేన‌..0
ట‌ఫ్‌.. 5

చిత్తూరు జిల్లాలో ఉన్న మొత్తం 14 స్థానాల్లో వైసీపీ 8, టీడీపీ1 స్థానాలు గెలుచుకోనున్నాయి. 5 స్థానాల్లో గ‌ట్టి పోటీ ఉండ‌నుంది. తంబ‌ల్లిప‌ళ్లి, మ‌ద‌న‌ప‌ల్లి, తిరుప‌తి, శ్రీకాల‌హ‌స్తి, చిత్తూర్ స్థానాల్లో గ‌ట్టిపోటీ ఉండ‌నుంది.

మొత్తం స్థానాలు…175

వైసీపీ గెలిచేవి… 85
టీడీపీ గెలిచేవి..34
జ‌న‌సేన గెలిచేవి.. 01
గ‌ట్టి పోటీ ఉన్న స్థానాలు.. 45

స‌ర్వేలో ప్ర‌ధానంగా టీడీపీ ప్ర‌భుత్వం పాల‌న‌ను 48 శాతం మంది ప్ర‌జ‌లు మెచ్చుకోగా, 46 శాతం మంది వ్య‌తిరేకంగా త‌మ అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. 6 శాతం మంది చెప్ప‌లేమ‌న్నారు. ఎమ్మెల్యేల ప‌నితీరును 32 శాతం స‌మ‌ర్థించగా, 62 శాతం మంది వ్య‌తిరేకంగా త‌మ అభిప్రాయాన్ని చెప్పారు. 6 శాతం మంది చెప్ప‌లేమ‌ని స‌మాధానం ఇచ్చారు. సీఎంఅభ్య‌ర్థిగా వైఎస్ జ‌గ‌న్ ను 46 శాతం స‌మ‌ర్థించ‌గా, బాబును 42 శాతం మంది స‌మ‌ర్ధించారు. మ‌రి ప్ర‌జ‌లు ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -