Friday, May 3, 2024
- Advertisement -

మంత్రి ప‌ద‌వుల‌పై మ‌రో సారి ఆశ‌లు పెట్టుకున్న అసంతృప్తులు…

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోబోతున్నారు. మ‌రో సారి తెనెతుట్టెను క‌దిలించ‌బోతున్నారు. త‌ప మంత్రి వ‌ర్గ టీంను మార్చెందుకు సిద్ధ‌మ‌వుతున్నారనె వార్త‌లు మంత్రుల గుండెల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. త్వ‌ర‌లోనె మ‌రోసారి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేయ‌బోతున్నార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి.

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగి ఏడాది కూడా పూర్తి కాలేదు. పార్టీ ఫిరాయిపుదారుల‌కు పెద్ద పీట వేయ‌డంతో చాలా మంది న‌తలు బాబుపై అసంతృప్తిని బ‌హిరంగంగానె వ్య‌క్తం చేశారు. అయితే వారిలో కొంత‌మంది అంచ‌నాల‌ను అందుకోలేక‌పోతున్నార‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. అందుకె మ‌రోసారి కేబినెట్‌ను పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించేందుకు సిద్ధ‌మవుతున్నార‌ట‌.

అత్యంత విశ్వ‌నీయ స‌మాచారం ప్ర‌కారం మరోసారి మంత్రివర్గ విస్తరణ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంద‌ట‌. మరోవారం పదిరోజుల్లో ఐదారుగురు మంత్రులను తప్పించి మరో ఐదు లేదా ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఎమ్మెల్యేల్లో, మంత్రుల్లో సగానికి పైగా మళ్లీ పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదని….వారిలో కొంత మంది మంత్రులను లోక్‌సభకు పంపాలని చంద్రబాబు నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో తొలి పేరు అయ్య‌న్నపాత్రుడి పేరు వినిపిస్తోంది . పార్టీలు మారేవారికి మంత్రి పదవులు ఇస్తున్నారని ప‌రోక్షంగా గంటాను ఉద్దేశించి వ్యాఖ్యానించే ఆయ‌న‌కు ఈసారి చెక్‌ పెడతారా..?ఇక మిత్ర ప‌క్షం భాజాపా మంత్రుల‌పైన‌కూడా బాబు అసంతృప్తిగా ఉన్నారంట‌. ఇక కామినేని స్థానంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుకు మంత్రి పదవి ఇవ్వాలని కేంద్ర పెద్దలు సిఫార్సు చేసే అవకాశాలు ఉన్నాయ‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి.

మంత్రికొల్లు ర‌వీంద్ర‌ను త‌ప్పించి కాకినాడ ఎమ్మెల్యే కొండ‌బాబుకు అవ‌కాశం ఇవ్వాల‌ని భావించినా.. కాకినాడ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆయ‌న‌ సిఫార్సు చేసిన వార్డు సభ్యులు ఓడిపోవడం మైన‌స్‌గా మారిందంట‌. ప్ర‌భుత్వానికి బాగా ప‌నికొస్తారని భావిస్తున్న బొండా ఉమా, వంగ‌ల‌పూడి అనిత‌, బుచ్చ‌య్య చౌద‌రి, ధూళిపాళ్ల న‌రేంద్ర‌, ప‌య్యావుల కేశ‌వ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎవరెవరికి మంత్రి పదవి ఇవ్వాలనే విషయంపై చంద్రబాబు తర్జనభర్జనలు పడుతున్నారని స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -