Saturday, April 20, 2024
- Advertisement -

కాంగ్రెస్‌ను టేకోవ‌ర్ చేసిన చంద్ర‌బాబు…..

- Advertisement -

తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు దోస్తీ చేసేస్తున్నాయి. ఈ దోస్తీని అనేకమంది అనేక రకాలుగా విశ్లేషిస్తూ ఉన్నారు. విజ‌యం కోసం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు. అయితే ఇప్పుడ ఆంధ్ర ప్ర‌దేశ్‌కి పొత్తు విష‌యం పాకింది. ఏపీలో రెండు పార్టీల పొత్తు ఉంటుందా..ఉండ‌దా అనే అనుమానాలు ప‌టాపంచ‌ల‌య్యాయి. తాజాగా రాహుల్‌, చంద్ర‌బాబు భేటీ అవ్య‌డంతో పొత్తు ఉంటుంద‌నే సంకేతాలు ఇచ్చారు.

ఇదంతా బాగానే ఉన్నా….అవ‌స‌రాలు పార్టీలు ఎంత నీచానికైనా దిగ‌జారుతాయి. త‌మ రాజ‌కీయ అవ‌స‌రాల‌కోసం పార్టీ సిద్ధాంతాలను తుంగ‌లోకి తొక్కి బ‌ద్ద‌శ‌త్రువులుగా ఉన్నా పార్టీలు ఒక‌ట‌వుతారు. అదే కోవ‌కు చెందిన‌దే టీడీపీ, కాంగ్రెస్ క‌ల‌యిక‌. కాంగ్రెస్ పార్టీ వ్య‌తిరే పునాదుల‌మీద పుట్టిన పార్టీ టీడీపీ. అలాంటి పార్టీ సిద్దాంతాల‌కు తిలోద‌కాలిచ్చారు చంద్ర‌బాబు. బాబు, రాహుల్ భేటీలో ఆంధ్రప్రదేశ్ లో పొత్తుపై నిర్ణయాధికారాన్ని చంద్రబాబుకే వదిలేసినట్లు ఆయన చెప్పారు. దీంతో ఎపి కాంగ్రెసు వ్యవహారాలను కూడా చంద్రబాబు నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఘ‌న‌చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బాబు ద‌గ్గ‌ర మోక‌రిల్లింది. దీన్ని బ‌ట్టి చూస్తే చంద్రబాబు ఎపి కాంగ్రెసును టేకోవర్ చేయబోతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. బాబు మ‌రో సార అధికారంలోకి రావాల‌ని….ఉనికిని చాటుకోవాల‌ని కాంగ్రెస్ రెండూ త‌మ స్వార్థ ప్ర‌యోజ‌నాల‌కోసం పొత్తు పెట్టుకున్నాయ‌నే విష‌యం తేట‌తెల్ల‌మ‌య్యింది.

చంద్రబాబు ప్రతిభా పాటవాలను తాను 2004లోనే గుర్తించి ప్రశంసించానని రాహుల్ గాంధీ అంటే, దేశానికి సమర్థ నాయకత్వాన్ని అందించే సత్తా రాహుల్ గాంధీకే ఉందని చంద్రబాబు కొనియాడారు. దీన్ని బట్టి, చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయావసరాలు, రాహుల్ గాంధీకి జాతీయ రాజకీయావసరాలు తీర్చుకోవడానికి అనుగుణంగా వ్యవహారాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో తాను 13 సీట్లకే పరిమితమయ్యాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలను తనకే వదిలేయాలని చంద్రబాబు రాహుల్ గాంధీని కోరినట్లు చెబుతున్నారు. పెద్ద భాగస్వామిగా తనకు వదిలేయడం న్యాయమని చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో సీట్ల పంప‌కాలు, పొత్తు వ్య‌వ‌హారాలంతా బాబు చేతుల్లో వెల్ల‌నుంది.

తెలంగాణలో చంద్రబాబు అవసరాలను కాంగ్రెసులో చేరిన రేవంత్ రెడ్డి తీరుస్తుంటే, ఆంధ్రప్రదేశ్ లో తిరిగి కాంగ్రెసు తీర్థం పుచ్చుకున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరుస్తారని అంటున్నారు. అదే సమయంలో ఇరు పార్టీల ఉమ్మడి శత్రువు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయనను ఎదుర్కోవడానికి రెండు పార్టీలు ఎపిలో ఏకమవుతున్నాయని అనుకోవచ్చు.

మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు పొడుస్తుందనేది అర్థమవుతోంది. పొత్తు సంకేతాల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రులు రామ‌చంద్ర‌య్య‌, వ‌ట్టి వ‌సంత‌కుమార్‌లు రాజీనామా చేశారు. మ‌రో వైపు ఏపీ పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డికూడా పొత్తు నేప‌థ్యంలో పార్టీ నేత‌లు త్యాగాలు చేయాల్సి ఉంటుందని ఇప్ప‌టికే సంకేతాలు ఇచ్చారు. రాజ‌కీయ అవ‌సరాలు ఎతంకైనాదిగ‌జార్చుతాయ‌నేదానికి ఉదాహ‌ర‌నే కాంగ్రెస్‌, టీడీపీ పొత్తు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -